Begin typing your search above and press return to search.
హమ్మయ్యా.. ఈటల మంత్రి పదవి సేఫ్?
By: Tupaki Desk | 8 Feb 2021 9:30 AM GMTతెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పదవికి ఇక ఢోకా లేదనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ సీఎం అయితే ప్రధాన పోటీదారుగా అందరూ డిమాండ్ చేస్తున్న ఈటలను పక్కనపెడుతారన్న ప్రచారం ఈ మధ్య సాగింది. ఈ క్రమంలోనే మంత్రి ఈటల సైతం ఇటీవల ‘తాను మంత్రి పదవిలో ఉండొచ్చు.. లేదా మరో పదవిలో ఉండొచ్చంటూ ’చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రైతు ఉద్యమం ఎక్కడున్నా తన మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.
దీన్ని బట్టి ఈటల మంత్రి పదవికి ఎసరు వస్తోందన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే సీఎం మార్పుపై ఇటీవల సీఎం కేసీఆర్ తెరదించారు. మరో పదేళ్ల వరకు నేనే సీఎం అంటూ ప్రకటించారు.కేటీఆర్ సీఎం వార్తలకు తెరదించారు. దీంతో మంత్రి ఈటల కూడా ఖుషీ అయ్యాడు.
ఇటీవల కేటీఆర్ కంటే మంత్రి ఈటలను సీఎం చేయాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈటల బీసీ అని.. బీసీనే సీఎం చేయాలని బీజేపీ కొత్త డిమాండ్ చేసింది. దీంతో బీజేపీ బీసీ కార్డ్ ఫార్ములాతో నష్టం అని గ్రహించిన కేసీఆర్ తానే పదేళ్లు సీఎం అని ప్రకటించి అన్ని ఊహాగానాలకు తెరదించారు.
ఇక కేసీఆర్ కేబినెట్ మార్పులు కూడా చేయడని తేలిపోయింది. ఈ కేబినెట్ నే వచ్చే ఎన్నికల వరకు ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని మంత్రి ఈటల కూడా సేఫ్ సైడ్ లో ఉన్నాడని.. రాబోయే మూడేళ్లు ఆయన మంత్రి పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది.