Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ఈటల కొత్త ట్రెండ్.. ఇప్పటివరకు ఎవరూ చేయనట్లుగా?

By:  Tupaki Desk   |   1 Jun 2021 3:30 AM GMT
ఢిల్లీలో ఈటల కొత్త ట్రెండ్.. ఇప్పటివరకు ఎవరూ చేయనట్లుగా?
X
పార్టీ మారాలన్న నేత ఏం చేస్తారు? రోటీన్ కు భిన్నమైన సీన్లు ఈటల ఎపిసోడ్ లో కనిపిస్తున్నాయి. ఒకపక్క పార్టీలో కొనసాగుతూనే.. మరోవైపు వేరే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయటం రాజకీయాల్లో మామూలే. అయితే.. ఇదంతా గుట్టుగా సాగుతుంది. అందుకు భిన్నంగా ఈటల మాత్రం ఓపెన్ గానే అన్ని చేస్తున్నారు. బీజేపీలో చేరతారంటూ సాగుతున్న ప్రచారానికి తగ్గట్లే ఆయన.. బీజేపీజాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇంతవరకు బాగానే సాగినా.. ఇక్కడే అసలు ట్విస్టు చోటు చేసుకుంది.

సాధారణంగా ఎవరైనా ప్రముఖ నేత పార్టీలో చేరాలనుకున్నప్పుడు రహస్య భేటీలు నిర్వహించి.. తమకున్న సందేహాల్ని తీర్చుకుంటారు. అదే సమయంలో తాను పార్టీలోకి వస్తే తనకు ఎలాంటి హామీలు ఇస్తారన్న విషయాల మీదా హామీ పొందుతారు. ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంటాయి. అందుకు భిన్నంగా ఈటల మాత్రం సరికొత్త ట్రెండ్ కు తెర తీశారని చెప్పాలి.

పార్టీ మారాలని ఫిక్స్ అయిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ అయి.. తనకున్న సందేహాల్ని ఆయన ముందు ఉంచటం.. వాటికి ఆయన ఇచ్చే సమాధానాల్ని వినటం.. అందులోని వివరాలు కొన్ని మీడియాలో రావటం చూస్తే.. కొత్త ట్రెండ్ కు ఈటల తెర తీస్తున్నారని చెప్పాలి. ఎంతసేపటికి తాను అడిగిన విషయాలు మాత్రమే మీడియాలో రావటం.. తనను అడిగిన విషయాలు.. కేసీఆర్ తో తనకు తేడా ఎక్కడ వచ్చిందన్న విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలో రాకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇదంతా చూస్తే.. ఇప్పటివరకు మరే నేత చేయని రీతిలో.. ఆయన పావులు కదుపుతున్నట్లుగా చెప్పాలి. బీజేపీలో చేరాలన్న అంశంపై ఈటలతో విభేదించే వర్గాలు లేకపోలేదు. అలాంటి వారిని సర్దిపుచ్చటం అంత తేలికైన విషయం కాదు.

అందుకే.. తాను తొందరపడి నిర్ణయం తీసుకోవటం లేదని.. తనకున్న సవాళ్లు.. కేసీఆర్ తో యుద్ధం చేయటం అంటే ఆషామాషీ కాదన్న సందేశాన్ని తాజా చర్చలతో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే.. మిగిలిన వారికి భిన్నంగా ఆయన చర్చల పేరుతో బీజేపీలో చేరే సీన్ ను మరింత సాగదీస్తున్నట్లుగా చెప్పక తప్పదు. ఉన్న పార్టీని వదిలి.. వేరే పార్టీలో చేరాలని ఒకసారి డిసైడ్ అయితే.. మూడో కంటికి తెలీకుండా అన్ని మాట్లాడేసుకునే తీరుకు భిన్నంగా ఉన్న ఈటల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.