Begin typing your search above and press return to search.
ఈటల రగులుతున్న అగ్నిపర్వతమా?
By: Tupaki Desk | 22 March 2021 1:56 AM GMTతెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక రగులుతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. అప్పుడప్పుడూ బుసలు కొడుతున్నాడు. ఆ పర్వతం ఎప్పుడు పగులుతుందో తెలియదు కానీ.. తనలోని అసంతృప్తిని అంతా అప్పుడప్పుడూ కక్కేస్తున్నాడు. తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేసి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాడు.
తాజాగా ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలతో హాట్ కామెంట్స్ చేశారు. ‘పెట్టింది ఎప్పుడూ చెప్పుకోవద్దని.. చేసిందంతా కూడా చెప్పుకోనక్కర్లేదని’ ఈటల అన్నారు. నేడు ఇబ్బంది పడుతుండొచ్చు.. గాయపడుతుండొచ్చు కానీ ఎప్పుడూ మనసు మార్చుకోలేదని నర్మగర్భంగా ఈటల చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
పెట్టే చెయ్యి ఆగదని.. చేసే మనిషిని తాను అస్సలు ఆగనంటూ కాస్త భావోద్వేగ స్వరంతో ఈటల తన ఆవేదన వెళ్లగక్కారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనను ఎంత గొప్పగా ప్రజలు నిలబెట్టారో మర్చిపోలేనని ఈటల అన్నారు. తాను ఉన్నంతవరకు తన వాళ్లు ఉన్నంత వరకు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు.. కానీ శాశ్వతంగా ఓడిపోదు.. మనిషిని మాత్రమే గుర్తు పెట్టుకోవాలి.. కులం మతం పార్టీ జెండాను కాదు.. అందరూ గుర్తు పెట్టుకోండి’ అంటూ ఈటల రాజేందర్ వేధాంత ధోరణి తరహాలో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కులం, డబ్బు, పార్టీ అనడంతో ఈటల రాజేందర్ ఎక్కడో అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.