Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: ఈటల రాజీనామా ఆమోదం
By: Tupaki Desk | 12 Jun 2021 9:30 AM GMTమాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా శనివారం మధ్యాహ్నం ఆమోదించారు. ఈటల రాజేందర్ ఈ ఉదయం రాజీనామా లేఖ సమర్పించారు. మధ్యాహ్నానికే స్పీకర్ ఆమోదించడం విశేషం.
రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్ లోనే ఉండడంతో ఎలాంటి అడ్డంకులు కలుగకుండా ఆమోదించేశారు. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈటల తొడగొడితే.. అందుకు ధీటుగా టీఆర్ఎస్ ప్రతిస్పందిస్తుండడం విశేషంగా మారింది.
కాగా ఇవాళ ఉదయమే స్పీకర్ ఫార్మాట్ లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి ఈటల రాజేందర్ ఇచ్చారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఈ రాజీనామా సమర్పించారు. ఇక ఈనెల 14న ఈటల బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖాయం చేసుకున్నారు. ఈనెల 14న ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారు.
కాగా టీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఈటల రాజీనామాను ఇంత త్వరగా ఆమోదిస్తారని ఎవరూ ఊహించలేదు. దీన్ని ఈటలను హుజూరాబాద్ లో ఢీకొట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే అలా ఈటల ఇవ్వగానే ఇలా ఆమోదించడం విశేషం. దీన్ని హుజూరాబాద్ కేంద్రంగా ఈటలకు, టీఆర్ఎస్ కు గట్టి పోటీ తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి.