Begin typing your search above and press return to search.
వైద్యఆరోగ్యశాఖ నుంచి తొలగింపుపై స్పందించిన ఈటల
By: Tupaki Desk | 1 May 2021 10:50 AM GMTవైద్య ఆరోగ్యశాఖను తన నుంచి సీఎం కేసీఆర్ బదిలీ చేయడంపై ఈటల రాజేందర్ స్పందించారు. దీనిపై ఈటల పాజిటివ్ గా వ్యాఖ్యానించడం విశేషం.తన శాఖను కేసీఆర్ కు బదిలీ చేసినట్లు తెలిసిందని.. ఇందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానని తెలిపారు.
'సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయి. ప్లాన్ ప్రకారమే నాపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయి. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి' అని ఈటల మీడియాతో మాట్లాడాలి.
సీఎం కేసీఆర్ తో ఇప్పటివరకు మాట్లాడే ప్రయత్నం చేయలేదని.. ఇకపై చేయబోనని ఈటల స్పష్టం చేశారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానన్నారు.
కొద్దిసేపటి క్రితమే మంత్రి ఈటల రాజేందర్ చూస్తున్న వైద్యఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్ శాఖలేని మంత్రిగా ఉంటారా? లేక ఆయనను బర్తరఫ్ చేస్తారా. అన్నది చూడాలి.