Begin typing your search above and press return to search.
లెక్కల మంత్రి గా చెప్తున్నా...2లక్షల రుణమాఫీ డౌటే అంటున్న ఈటల
By: Tupaki Desk | 8 May 2022 12:26 AM GMTతాము అధికారంలోకి వస్తే, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ సంచలన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీ ప్రస్తుతం ఇటు రైతుల్లో అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారుతోంది.
దీనిపై వివిధ రాజకీయ పార్టీల తమదైన శైలిలో స్పందించగా మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని... 2లక్షల రుణమాపీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఆర్ధిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నా.. ఒకేసారి 2లక్షల రుణమాఫీ సాధ్యం కాదు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
హుజురాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఏది చేయగలరో అది చెప్పాలి అంతేకానీ.. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వొద్దని రైతులు అంటున్నారని చెప్పారు. ఎకరానికి 15 వేలు ఒకేసారి ఇస్తారా? ఎలా ఇస్తారు? దానికి క్లారిటీ లేదు.. మొదటి పంటకి ఇస్తారా? రెండో పంటకి ఇస్తారా? అని ప్రశ్నించారు.
వ్యవసాయం సన్నగిల్లితే నిరుద్యోగం.. పేదరికం పెరగుతుందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే కేంద్రం లక్ష కోట్లకు పైగా సబ్సిడీలు ఇస్తోందన్నారు. నాబార్డు ద్వారా లక్షల కోట్లు సహాయం చేస్తోందని, ఇన్ని చేస్తున్నా కేంద్రంపై ఆడిపోసుకోవడం సరికాదన్నారు. మోసం చేస్తున్నది కేంద్రం కాదు... డ్రామాలు, మోసాలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశౄరు. రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అయినా లక్ష రూపాయల రుణ మాఫి చేయలేదని ఆయన తెలిపారు. తాను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాలుగు సార్లు మేనిఫెస్టో రాసినా అది అమలు కాలేదని..ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఈటల రాజేందర్ తెలిపారు.
ఇప్పుడు రాష్ట్రంలో తాతలు సంపాదించిన ఆస్తులు అమ్ముకుని సోకులు చేస్తున్నట్లుంది కేసీఆర్ పరిస్థితి.. లిక్కర్ ద్వారా వస్తేనే ఆదాయం.. లేకుంటే ఆస్తులు అమ్మే పరిస్థితి నెలకొందని అన్నారు. పెన్షన్లు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. డబల్ బెడ్ రూంలు లేవు.. చేతగాని సీఎం తప్పుకోవాలని డిమాండ్ చేశారు.