Begin typing your search above and press return to search.
తెలంగాణ సీఎం మార్పుపై ఈటెల సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 19 Jan 2021 4:35 AM GMTగడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ పదవీ బాధ్యతలు తీసుకోవటం ఖాయమని.. అందుకు తగ్గట్లే పలు చర్యలు తీసుకుంటున్నట్లుగా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో పోలిస్తే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని విన్నప్పుడు.. సీఎం కుర్చీలో కేటీఆర్ కూర్చునే రోజు అతి దగ్గర్లోనే ఉందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. అంతేకాదు.. సీఎం మార్పు ఉండొచ్చన్న స్పష్టమైన సంకేతాల్ని ఆయన ఇచ్చేశారు.
తమ దగ్గర 99 శాతం కార్యక్రమాల్ని మంత్రి కేటీఆర్ చూస్తారని.. ముఖ్యమంత్రి అందుబాటులోలేని సమయంలో ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. అందుకు తగ్గ ఉదాహరణను ఆయన ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. ‘మొన్న టీకా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?’ అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ కు తనకు ఎలాంటి గ్యాప్ లేదని.. అందుకు ఆస్కారమే లేదన్న ఆయన.. పార్టీ ఎవరిని సీఎంగా నియమించినా సమిష్టి కృషితో నిలుస్తుందన్నారు. అయినా.. ఒక వ్యక్తి మీద పార్టీ ఆధారపడి లేదన్న ఆయన.. ‘ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండొచ్చు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఉంటే ఉంటదండీ.. తప్పేముంది? అని కీలక వ్యాక్యలు చేశారు.
కరోనా టీకా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవటంపై రంధ్రాన్వేషన చేయాల్సిన అవసరం లేదన్న ఈటెల.. తమ దగ్గర 99 శాతం కార్యక్రమాల్ని కేటీఆర్ చూస్తారని చెప్పటం ద్వారా.. ఇప్పటికే యాక్టింగ్ సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. పార్టీ ఎవరు పెట్టినా.. జెండా ఎవరు తెచ్చినా.. సమిష్టిగా పని చేస్తేనే పార్టీ నిలుస్తుంది. ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదన్నారు. టీఆర్ఎస్ లో ప్రతి వ్యక్తీ తన పార్టీ.. తన జెండా అని గుండెల్లో పెట్టుకోకపోతే పార్టీ బాగుందన్నారు.
‘ఒక విజయం అనేక తప్పులను కప్పిపుచ్చుతుంది. ఒక పరాజయం అనేక రకాల తప్పులను ఎత్తిచూపుతుంది. ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా మార్పు అనేది సహజం. ఎక్కడైనా లోపాలుంటే, సరిచేసుకోవాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించిన ఈటెల.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బలపై మరింత ఆసక్తికరంగా స్పందించారు. ఎన్నో ఘన విజయాలు సాధించి.. సంస్థాగత బలం దండిగా ఉన్న టీఆర్ఎస్ వరుసగా రెండు ఎన్నికల ఫలితాల తర్వాత ఉడ్చేస్తాం.. తుడిచేస్తామనే భ్రమల్లో ఉండకూడదన్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండలేమని.. ఒకసారి ఉత్సాహంగా.. మరోసారి బాధల్లో ఉంటామన్న ఆయన మాటలు ఎలా ఉన్నా.. సీఎం మార్పు సీన్ త్వరలోనే తెర మీదకు వస్తుందన్న విషయాన్ని మంత్రి ఈటెల చెప్పనే చెప్పేశారంటున్నారు.