Begin typing your search above and press return to search.
హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల ప్రమాణ స్వీకారం
By: Tupaki Desk | 10 Nov 2021 7:30 AM GMTహుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. హుజురాబాద్ గడ్డపై మరోసారి విజయ దుందుభి మోగించన ఈటల రాజేందర్ .. బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణాస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది ఏడోసారి. ఇప్పటివరకు ఆరు సార్లు ఆయన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీ కి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత, 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ సీటింగ్ వైపు కూర్చున్నారు. కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత ఈటల రాజేందర్, బీజేపీలో చేరారు. అదే పార్టీ నుంచి టికెట్ పై హుజూరాబాద్ బైపోల్ లో గెలిచారు. గత ఆరుసార్లకు భిన్నంగా ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రమంతటా ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో ఈ ఆసక్తి మరింత పెరగనుంది.