Begin typing your search above and press return to search.

విహారంలో.... విషాదం

By:  Tupaki Desk   |   12 March 2019 4:56 PM GMT
విహారంలో.... విషాదం
X
వారు భారతీయులే... కాదు కాదు ప్రవాస భారతీయులు... ఒక వారం రోజులు కుటుంబం అంతా సరదాగా - సందడిగా గడపాలని అనుకున్నారు. ఈ వత్తిడులకు - రోజువారి జీవానానికి దూరంగా గడపాలని అనుకున్నారు.. కాని తానొకటి తలిస్తే, దైవం ఒకటి తలచింది అన్నట్లు వారంత కూడ ఇథోపియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈథోపియా బోయింగ్ 737 బయలుదేరిన ఆరు నిమిషాలకే రాడర్ తో సంబంధాలు తెగిపోవడంతో ఆ విమానంలో ఉన్న 149 ప్రయాణికులు - 8మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

సూరత్ కు చెందిన ఈ కుటుంబం చాల సంవత్సరాల క్రితం కెనడా వలస వెళ్లి అక్కడే స్దిరపడిపోయారు. అయితే కెన్యాలో సఫారి పార్క్ సందర్శించుకుందామని ఒకే కుటుంబానికి చెందిన 6 ఈథోపియా బోయింగ్ 737 ప్రమాదానికి గురికావడంతో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబానికి విషాదం మిగిల్చింది. చనిపోయిన ఆ కుటుంబ సభ్యులను పన్నగేష్ వైద్య (73) - ఆయన భార్య హాసిని వైద్య(67) - వారి కుమార్తే కోషా వైద్య (37) - ఆమె భర్త ప్రేరిత్ దీక్షిత్ (45) - వారి పిల్లలు అనుష్క - అష్క గా గుర్తించారు.ఈ సంఘటన వైద్య కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పన్నగేష్ కుమారుడు మన్నత వైద్య ఈ ఘటన గురించి మాట్లాడుతూ "నేను ఒకేసారి తల్లితండ్రులను - సోదరిని - బావని మేనకోడళ్లని పోగొట్టుకున్నాను. ఇక నాకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు" అని అనడంతో ఈ మాటలు అందరి హ్రుదయాలను తాకింది. ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువ జరగడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ ప్రయాణాలు చేస్తున్నారు.