Begin typing your search above and press return to search.
వచ్చేశాయి రామోజీ నాలుగు కొత్త ఛానళ్లు
By: Tupaki Desk | 14 Nov 2015 9:37 AM GMTమీడియా మొఘల్ గా పేరు పొందిన రామోజీరావు సంస్థ నుంచి మరో నాలుగు కొత్త ఛానళ్లు వచ్చేశాయి. గతంతో పోలిస్తే.. ఇవాల్టి రోజున ఒకేసారి నాలుగు ఛానళ్లను స్టార్ట్ చేయటం అంత సులువైన ప్రక్రియ కాదు. కుప్పలుతెప్పలు ఛానళ్లు వస్తున్న వేళ.. ఒక్కో విభాగానికి ఒక్కో ఛానల్ అంటూ.. తన స్థాయికి తగ్గట్లు నాలుగు భిన్నమైన కాన్సెప్ట్స్ తో కొత్త ఛానళ్లను రామోజీ ఈ రోజు విజయవంతంగా ప్రారంభించారు.
ఒక ఛానల్ ప్రారంభిస్తుంటేనే.. భారీ ఎత్తున ఓపెనింగ్ కార్యక్రమం పెట్టి.. ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రులు.. కేంద్రమంత్రులు.. సినీ తారలతో హడావుడి చేయటం తెలిసిందే. కానీ.. ఒకేసారి నాలుగు ఛానళ్లను స్టార్ట్ చేస్తూ కూడా అతిధులుగా వీవీఐపీల్ని ఎవరిని పిలవకుండా.. ఆ ప్రక్రియను తన చేతలతోనే పూర్తి చేసేశారు రామోజీ. రాష్ట్ర విభజన నేపథ్యంలో లేనిపోని ఇబ్బందులు ఎందుకునుకున్నారో ఏమో కానీ.. ప్రారంభోత్సవాన్ని తమ వరకే పరిమితం చేసుకున్న ఆయన.. నాలుగుకొత్త ఛానళ్లను రామోజీ తన స్వహస్తాలతో ప్రారంభించారు. తనదైన విలక్షణతో వ్యవహరించే రామోజీ.. నాలుగు ఛానళ్లను స్టార్ట్ చేస్తూ.. వీవీఐపీలను పిలవకుండానే.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయటం విశేషం. ముందుగా ప్రకటించినట్లే.. సరిగ్గా ముహుర్త సమయానికి ఈటీవీ నాలుగు కొత్త ఛానళ్లు ప్రారంభమయ్యాయి.
ఇక.. నాలుగు ఛానళ్ల విషయానికి వస్తే.. హాస్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈటీవీ ప్లస్.. ఆరోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించేలా ఈటీవీ లైఫ్.. పరిమితమైన వాణిజ్య ప్రకటనలతో తెలుగు.. హిందీ.. ఇంగ్లిషు సినిమాలు అందించేలా ఈటీవీ సినిమా.. దేశ.. విదేశీ రుచులను పరిచయం చేస్తూ.. ఈటీవీ అభిరుచి ఛానళ్లను స్టార్ట్ చేశారు. ఏమైనా రామోజీ.. రామోజీనే.