Begin typing your search above and press return to search.
పాకిస్తాన్, చైనాపై యూరప్ ఆగ్రహిస్తోంది
By: Tupaki Desk | 13 March 2017 1:41 PM GMTపాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బలుచిస్తాన్ వాసులు తమకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున గళం విప్పారు. స‌్విట్జర్లాండ్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు బలూచిస్థాన్ ఉద్యమకారులు ఆందోళన నిర్వహించారు. పాకిస్థాన్ - చైనాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై మండిపడ్డారు. పాక్ - చైనా బలూచిస్థాన్ ప్రజలను దోచుకోవడం ఆపండి..మా దేశానికి స్వేచ్ఛ ప్రసాదించండి అంటూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన నిర్వహించారు.
ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరంగా బలుచిస్తాన్ వాసులకు యురోపియన్ యూనియన్ మద్దతు తెలిపింది. బలూచ్ ప్రజలను పాకిస్తాన్ హింసించడాన్ని ఈయూ సహించబోదని ఈయూ పార్లమెంట్ రిజార్డ్ కార్నెకీ స్పష్టంచేశారు. వారికి తగు న్యాయం జరగాలనే డిమాండ్ తోనే తాము మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. కాగా, బలూచ్ ఉద్యమకారుడు మెహ్రాన్ మర్రీ తమ ఆందోళనపై వివరణ ఇచ్చారు. బలూచిస్థాన్ లో గత నాలుగైదు నెలలుగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన వాపోయారు. పాక్ మిలిటరీ - ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మహిళలు - చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నాయని ఆరోపించారు. పాక్ తో చేతులు కలిపితే.. తమకే నష్టమన్న విషయాన్ని చైనా గ్రహించాలని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/