Begin typing your search above and press return to search.

ప్రమాదపు అంచున యూరోప్ దేశాలు

By:  Tupaki Desk   |   4 March 2022 1:30 PM GMT
ప్రమాదపు అంచున యూరోప్ దేశాలు
X
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కాదు కానీ యావత్ యూరప్ దేశాలు ప్రమాదం అంచుల్లోకి కూరుకుపోతున్నాయి. తొమ్మిది రోజులుగా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా సైన్యం తాజాగా జరోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాంతంపై దాడి చేశాయి. ఈ ప్రాంతంలో రష్యా సైన్యాలు ఎప్పుడైతే దాడులు మొదలుపెట్టాయో వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ వీడియో హెచ్చరిక రిలీజ్ చేశారు.

రష్యా సైన్యం దాడిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గనుక దెబ్బతింటే యావత్ యూరప్ దేశాలు దారుణంగా దెబ్బతినటం ఖాయమని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తంచేశారు. ఎప్పుడైతే రష్యా జిరోరిజియా ప్రాంతంపై దాడులు మొదలు పెట్టాయో వెంటనే ఆ ప్రాంతంలోని వేలాది జనాలంతా భయంతో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు.

న్యూక్లియర్ ప్లాంట్ గనుక బాంబుల ప్రభావంతో పేలిపోయినా లేదా ఎక్కడైనా లీకైనా యూరోపు దేశాలన్నీ ప్రమాదంలో పడిపోవటం ఖాయమని పవర్ ప్లాంట్ ఇన్చార్జి డిమిత్రి ఖులేబా ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ పవర్ ప్లాంట్ గనుక పేలితే ఛెర్నోబిల్ ప్రమాదంకు మించి పది రెట్ల ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పటికే దాడుల కారణంగా ప్లాంటులో మంటలు మొదలైపోయాయి. వీటిని ఆపేందుకు సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఈ చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో అర్థం కావటం లేదు. ఎందుకంటే ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబుదాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇపుడు ప్లాంట్ భద్రతకు పెద్ద ప్రమాదం వచ్చిపడింది. అందుకనే ఎప్పుడేమవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు.