Begin typing your search above and press return to search.

రష్యాకు ఈయూ షాక్

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 PM GMT
రష్యాకు ఈయూ షాక్
X
ఉక్రెయిన్ పై యుద్ధం చేయటానికి కారణమైన ఈయూ సభ్యత్వంపై రష్యాకు ఐరోపా సమాఖ్య పెద్ద షాకే ఇచ్చింది. యురోపియన్ యూనియన్ దేశాల సమాఖ్యలో ఉక్రెయిన్ సభ్యత్వం తీసుకోవాలని ప్రయత్నించింది. దీనికి ఈయూ దేశాలు కూడా సానుకూలంగా స్పందించాయి. దీనికి రష్యా తీవ్రస్ధాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఈయూలో సభ్యత్వం తీసుకోబోతున్న ఉక్రెయిన్ భూభాగంలోకి అగ్రరాజ్యం అమెరికా అడుగుపెట్టబోతోందని రష్యా అనుమానించింది.

శతృదేశం అమెరికా ఉక్రెయిన్ భూభాగంలో కాలుపెడితే తమకు పక్కలో బల్లెం లాగ తయారవ్వటం ఖాయమని రష్యా భయపడింది. ఇందుకనే ఉక్రెయిన్ కు ఈయూ సభ్యత్వం ఇచ్చేందుకు లేదని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రష్యా అభ్యంతరాలను ఉక్రెయిన్ పట్టించుకోకపోవటంతోనే హఠాత్తుగా యుద్ధాన్ని ప్రారంభించింది. యుద్ధం కారణంగానే ఈయూ సభ్యత్వం విషయంలో అనేక మలుపులు తిరిగింది. ఒకసారి సభ్యత్వాన్ని తీసుకోవడం లేదని, మరోసారి దరఖాస్తు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అయోమయం సృష్టించారు.

ఈ నేపధ్యంలోనే ఈయూలో ఉక్రెయిన్ కు డైరెక్టుగా సభ్యత్వం ఇవ్వకపోయినా అభ్యర్ధి హోదాను ఇచ్చినట్లు ఈయూ ప్రకటించింది. ఈయూలో ఉక్రెయిన్ను చేర్చుకోవటానికి సమాఖ్య గ్నీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అందుకు ముందుగా సభ్యత్వ హోదా కల్పించినట్లు ప్రకటించింది. ముందుగా సభ్యత్వం దక్కించుకున్న ఉక్రెయిన్ ఈయూ నిబంధనలను, షరతులను పాటిస్తే తర్వాత డైరెక్టుగా ఈయూలో సభ్య దేశమైపోతుంది. అంటే ముందు సభ్యత్వ హోదా తర్వాత డైరెక్టుగా సభ్యదేశం అన్నమాట.

అంటే ఇపుడు జరిగిన ప్రక్రియను చూసిన తర్వాత రష్యా ఎంత యుద్ధం చేసినా ఉపయోగం లేకపోయిందని అర్ధమైపోతోంది. ఏ సభ్యత్వానికి వ్యతిరేకంగా రష్యా యుద్ధం ప్రారంభించిందో దాన్ని అడ్డుకోలేకపోయింది. కాబట్టి ఇక యుద్ధం చేసి ఎలాంటి ఉపయోగం లేదు. లేదంటే యుద్ధంలో ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించేసి ఏకంగా తనలో కలిపేసుకోవడం ఒకటే రష్యా ముందున్న మార్గం.

అంటే పాతకాలంలో యుద్ధాలు చేసిన రాజులు ఓడించిన రాజ్యాన్ని తమ రాజ్యంలో కలిపేసుకున్నట్లన్నమాట. అప్పుడు ఉక్రెయిన్ దేశమన్నదే ఉనికిలో ఉండదు కాబట్టి ఈయూ సభ్యత్వ హోదా లేదా సభ్యత్వం అన్న సమస్యే ఉత్పన్నం కాదు.