Begin typing your search above and press return to search.
కాశ్మీర్ లో పర్యటిస్తున్న ఈయూ టీమ్..
By: Tupaki Desk | 29 Oct 2019 8:22 AM GMTవరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ..కాశ్మీర్ పై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీన కాశ్మీర్ లో ఉండే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాక్ ఒక్కసారిగా భారత్ పై నిప్పులు చేరగడం మొదలుపెట్టింది. గత 85 రోజులుగా కాశ్మీర్ లోకి ఎవరినీ రానీయడం లేదని - అక్కడ పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని పాక్ ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తుంది. పాక్ వ్యూహాన్ని కేంద్రం సరైన సమయంలో తిప్పికోట్టింది అని చెప్పాలి.
జమ్ముకశ్మీర్ లో ఎటువంటి మానవహక్కుల ఉల్లంఘన జరగడం లేదు అని వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి చూపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే నేడు యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం కశ్మీర్ లో పర్యటిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ లో పర్యటిస్తున్న తొలి అంతర్జాతీయ బృందం ఇదే కావడం విశేషం. పాక్ ప్రచారాన్నినమ్మెద్దని - మీరు అక్కడికి వెళ్లి వాస్తవ పరిస్థితులను చూడాలని యూరోపియన్ ఎంపీలను ప్రధాని కోరారు.
యూరోపియన్ యూనియన్ కు చెందిన 28 మంది వివిధ దేశాల ఎంపీల బృందం కాశ్మీర్ లో పర్యటిస్తుంది. ఈ పర్యటన సందర్భంగా జమ్మూకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను వారు పరిశీలించనున్నారు. పాకిస్థాన్ ఆరోపిస్తున్నట్టుగా అక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందా లేదా అనే విషయాన్ని అధ్యయనం చేయబోతున్నారు. ఇప్పటికే యూరోపియన్ పార్లమెంటు భారత్ కు తన మద్దతును ప్రకటించింది. గత నెలలో జమ్మూకశ్మీర్ అంశంపై యూరోపియన్ పార్లమెంటు చర్చించింది. ఈ సందర్భంగా కశ్మీర్ లోయలో వీలైనంత త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించింది. అంతర్జాతీయ మీడియాలో కూడా కశ్మీర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.