Begin typing your search above and press return to search.

బెంగాల్లో బీజేపీ ఖాళీ... కాంగ్రెస్‌లోకి సువేందు అధికారి జంప్‌..!

By:  Tupaki Desk   |   1 Dec 2021 1:30 PM GMT
బెంగాల్లో బీజేపీ ఖాళీ... కాంగ్రెస్‌లోకి సువేందు అధికారి జంప్‌..!
X
ప‌శ్చిమ బెంగాల్లో ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా బీజేపీ అక్క‌డ కోలుకోలేని ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు యేడాది కాలం నుంచి మ‌మ‌త ప్ర‌భుత్వంపై బీజేపీ జాతీయ స్థాయి నేత‌లు ఎంత బ్యాడ్ ప్రాప‌గంగా చేశారో చూశాం. ఎలాగైనా మ‌మ‌త‌ను గ‌ద్దె దింపాల‌ని సామ‌ధాన దండోపాయాలు అన్ని ప్ర‌యోగించారు.

చివ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి మోడీ సైతం అక్క‌డ‌కు వ‌చ్చి విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ విగ్ర‌హాన్ని తుడిచి చాలా సెంటిమెంట్లు ప్ర‌యోగించారు. పైగా టీఎంసీలో మ‌మ‌త‌కు కుడిభుజంలా ఉన్న కీల‌క నేత సువేందు అధికారితో మొద‌లు పెట్టి చాలా మంది కీల‌క నేత‌ల‌కు క‌మ‌లం గూటికి చేర్చేసుకున్నారు.

క‌ట్ చేస్తే ఎన్నిక‌ల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. మ‌మ‌త డ‌బుల్ సెంచ‌రీ కొడితే.. బీజేపీ సెంచ‌రి కూడా కొట్టేలేదు. ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీకి చెందిన కీల‌క నేత‌లు ఇప్పుడు టీఎంసీలోకి వెళ్లిపోతున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సువేందు దమ్ముంటే నందిగ్రామ్‌లో మ‌మ‌త త‌న‌పై గెల‌వాల‌ని స‌వాల్ చేశారు.

త‌న కంచుకోట అయిన భ‌వానీపూర్‌ను వ‌దులుకుని మ‌రీ మ‌మ‌త నందిగ్రామ్‌లో సువేందుపై పోటీ చేసి 2 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. బీజేపీ వాళ్లు నందిగ్రామ్ మీద కాన్‌సంట్రేష‌న్ చేసి.. రాష్ట్రాన్ని వ‌దిలేయ‌డంతో మ‌మ‌త నందిగ్రామ్‌లో గ‌ట్టి పోటీ మ‌ధ్య‌లో ఓడిపోయినా రాష్ట్రంలో ఘ‌న‌విజ‌యం సాధించి మూడోసారి బెంగాల్ ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఇక ఇప్పుడు మ‌మ‌త కేవ‌లం బెంగాల్‌కు మాత్ర‌మే కాకుండా దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె నెక్ట్స్ టార్గెట్ రేసులో గోవా, తెలంగాణ పేర్లు ఉన్నాయి. ప‌లు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అసంతృప్త నేత‌ల‌పైనే ఆమె గురి పెట్టింద‌ని అంటున్నారు.

ఆమె వ్యూహాత్మ‌క రాజ‌కీయం వెన‌క ప్ర‌శాంత్ కిషోర్ కూడా ఉన్నాడ‌నే అంటున్నారు. అయితే ఇక్క‌డే బీజేపీ మ‌రో ఆలోచ‌న చేస్తోంద‌ని అంటున్నారు. దేశంలో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాక‌పోతే మ‌మ‌త ఎలాగూ బీజేపీకి స‌పోర్ట్ చేయ‌దు.

అప్పుడు మ‌మ‌త‌కే బీజేపీ స‌పోర్ట్ చేసి ఆమెను పీఎం చేయాల‌ని చూస్తోంద‌ట‌. అప్పుడు మ‌మ‌త పీఎం అయితే బెంగాల్లో బీజేపీ బ‌ల‌ప‌డుతుంద‌ని బీజేపీ హై క‌మాండ్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇదే జ‌రిగితే సువేందు అధికారి ఖ‌చ్చితంగా బీజేపీకి ఎదురు తిరుగుతార‌ని తెలుస్తోంది. బీజేపీ స్వార్థ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టేలా అప్పుడు బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలు అంద‌రిని తీసుకుని ఆయ‌న కాంగ్రెస్ వైపు వెళ్లే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.

సువేందుకు బ‌ల‌మైన మాస్ ఫాలోయింగ్ ఉంది. సువేందు రేప‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులతో క‌లిసి 4 శాతం ఓట్లు చీలిస్తే అక్క‌డ బీజేపీ, టీఎంసీల‌కు ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వు. ఒక‌వేళ‌ రేపు ఏదైనా అద్భుతం జ‌రిగి.. మ‌మ‌త + బీజేపీ క‌లిస్తే బెంగాల్లో సువేందు బీజేపీని ఖాళీ చేయ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు.