Begin typing your search above and press return to search.
సారు ఫ్లెక్సీ.. ఈసారి ఐఏఎస్ అధికారికి ఫైన్
By: Tupaki Desk | 18 Feb 2020 6:15 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఏమోకానీ.. ప్రముఖులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న కేసీఆర్ మీద తనకున్న అభిమానాన్ని నిలువెత్తు ఫ్లెక్సీతో ప్రదర్శించే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి రూ.5వేల జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ఐపీఎస్ అధికారి కమ్ జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి విశ్వజిత్ కంపాటి.
ఈ వ్యవహారం పెను దుమారంగా మారింది. సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన మంత్రికే ఫైన్ వేస్తారా? అన్న ఆగ్రహం పలువురిలో వినిపించినా.. దీని కారణంగా సదరు ఫోటో మీడియా లో భారీగా కవర్ అయ్యిది. ఇదో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మరో ఐఏఎస్ అధికారి తాజాగా ఫైన్ పంచ్ పడింది.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ఏకంగా 2.5 లక్షల మొక్కల్ని నాటాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.దీనికి తగ్గట్లే తాము సేకరించిన మొక్కల్ని సర్కిళ్ల వారీగా పంపిణీ చేశారు. అలా గోల్కొండ కోట వద్ద కూడా మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి.. సీఎం బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కావటంతో.. అక్కడో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
అయితే.. ఈ ఫ్లెక్సీ ఉదంతాన్ని సోషల్ మీడియాలో ఒకరు జీహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ జోనల్ అధికారి అయిన జెడ్సీ కు ఒక్కో ఫ్లైక్సీ రూ.5వేలు చొ్ప్పున ఫైన్ విధించారు. దీంతో.. జోనల్ కమిషనర్ ప్రావీణ్య ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. సారుఫ్లెక్సీలేమో కానీ.. ఫైన్ల మీద ఫ్లైన్లు పడుతున్నాయి.