Begin typing your search above and press return to search.
కేంద్రమంత్రి కారుకు ఫైన్ వేశారు
By: Tupaki Desk | 9 Sep 2019 3:22 PM GMTఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టంతో వాహనదారుల జేబులకు భారీగా చిల్లులు పడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా ఈ చట్టం వల్ల అధికారులు వాహనదారులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అవి కట్టలేక సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే భారీ మొత్తంలో ఫైన్ వేయడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ఇక దీనిపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా స్పందించారు.
కొత్త మోటారు వాహన చట్టాన్ని ఆయన సమర్ధిస్తూ....తన వాహనానికి కూడా జరిమానా పడిందని చెప్పుకొచ్చారు. ఇటీవల తన వాహనం ముంబైలో బాంద్రా వర్లీ దారిలో వేగంగా వెళ్లిందని గుర్తుచేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందున తనకు కూడా ఫైన్ పడిందని...ఆ ఫైన్ కట్టానని తెలిపారు. ఈ సందర్భంగా చట్టం ముందు అందరూ సమానులేనని .. ఎవరు అతీతులు కారని పేర్కొన్నారు. ఇక ట్రాఫిక్ అధికారులు ఎవరిపై వివక్ష చూపరని తెలిపిన ఆయన, నిబంధనలు ఉల్లఘించిన వారు ఎవరైనా సరే తప్పకుండా జరిమానా కట్టాల్సిందేనని అన్నారు.
అంతకు కముందు కొందరు ముఖ్యమంత్రుల వాహనాలకు అధికారులు జరిమానాలు విధించినట్టు గుర్తుచేశారు. అయితే దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో కొత్త మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసమే కఠిన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అలాగే భారీ జరిమానాల కారణంగా అవినీతి కూడా పెరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలని గడ్కరీ ఖండించారు. తాము అన్నీ చోట్ల కెమెరాలని పెట్టామని - కాబట్టి అవినీతికి ఆస్కారం ఎక్కడ ? ఉంటుందని ప్రశ్నించారు. మొత్తానికి ఈ కొత్త చట్టంతో కేంద్ర మంత్రి సైతం ఫైన్ కట్టాల్సి వచ్చింది.