Begin typing your search above and press return to search.

పాజిటివ్​ వచ్చినా.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చు..!

By:  Tupaki Desk   |   23 May 2021 3:32 AM GMT
పాజిటివ్​ వచ్చినా.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చు..!
X
పాలిచ్చే తల్లికి (బాలింతకు) కరోనా వస్తే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా? ఈ విషయంపై చాలా రోజులుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలింతలు బిడ్డలకు పాలు పట్టొచ్చని ఇప్పటికే డబ్ల్యూహెచ్​వో పేర్కొన్నది. తాజాగా నేషనల్‌ నియోనాటల్‌ ఫోరం తెలంగాణ చాప్టర్‌ ప్రతినిధులు, నిలోఫర్‌ వైద్య నిపుణులు ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చారు. పాలిచ్చే తల్లులకు కరోనా పాజిటివ్​ వచ్చినా.. వాళ్లు నిరంభ్యంతరంగా బిడ్డలకు పాలు ఇవ్వొచ్చని చెప్పారు. పాలు ఇవ్వడం వల్ల బిడ్డలకు కరోనా వైరస్​ సోకదని వారు పేర్కొన్నారు. దీంతో ఇక నుంచి బాలింతలు నిర్భయంగా తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చు. పైగా పాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు.


చిన్నపిల్లలకు కరోనా వస్తే ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. కాబట్టి పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. కచ్చితంగా మాస్కులు ధరించాలంటున్నారు. ప్రస్తుతం పిల్లలకు కరోనా చాలా తక్కువగా అటాక్​ అవుతోంది. ఒకవేళ వచ్చినా వాళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం తల్లిపాలే. కాబట్టి.. తల్లిపాలను ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా మొదటి వేవ్​తో పోలిస్తే.. సెకండ్​ వేవ్​ భయంకరంగా విజృంభిస్తున్న విషయంతెలిసిందే. సెకండ్​ వేవ్​లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.

ప్రభుత్వాలు చెప్పిన లెక్కలంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని సమాచారం. మరణాల రేటు ఎక్కువగా ఉండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొన్నది. మరోవైపు ఆక్సిజన్​ కొరత కూడా వేధిస్తున్నది. చాలా ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా లేవు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మొదటి వేవ్​ లో కరోనా మనకు రాదులే.. అని చాలామంది భరోసాతో ఉండేవారు. కానీ ఇప్పటి పరస్థితి అందుకు భిన్నంగా ఉంది. పల్లెలు పట్నాలు, పేదలు, ధనికులు అనే బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కరోనా వేధిస్తున్నది.