Begin typing your search above and press return to search.
పవన్ ఓపెన్ గా చెప్పేసినా వైసీపీ నేతల గగ్గోలు పెడుతున్నారెందుకు?
By: Tupaki Desk | 14 Jan 2023 4:30 PM GMTఉన్నది ఉన్నట్లుగా చెప్పటం కూడా నేరమే అవుతుందా? నా స్థాయి ఇంత. నా బలం ఇంత అంటూ.. వాస్తవానికి దగ్గరగా చెప్పే మాటలకు కావాల్సింది ధైర్యం. అలాంటిది తనలో టన్నుల కొద్ది ఉందన్న విషయాన్ని యువశక్తి సభలో ఓపెన్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరూ కూడా తమకు సంబంధించిన అన్ని విషయాల్ని ఓపెన్ గా పంచుకోవటానికి ఇష్టపడరు. కానీ.. పవన్ స్టైల్ కాస్తంత భిన్నంగా ఉంటుంది. రెండున్నర గంటల పాటు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయి.. ఏం మాట్లాడారు? అన్న ప్రశ్నకు కూడా ఆయన చెప్పేసిన మాటల్ని చూస్తే..
పవన్ ఎంత కుల్లాగా చెప్పేశారన్న భావన కలుగుతుంది. నిమిషాలు.. సెకన్లతో సహా తాను చంద్రబాబుతో భేటీ సందర్భంగా చర్చించిన ప్రతి అంశాన్ని వెల్లడించారు. నిజానికి ఇదొక్కటే కాదు.. తాను ఎందుకు పొత్తుల గురించి మాట్లాడుతున్నానన్న విషయాన్ని చెప్పేశారు. సాధారణంగా రాజకీయ అధినేతలు ఎవరైనా సరే తమకు లేని శక్తుల గురించి చెప్పుకునేందుకు.. తమను తాము హైప్ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే.. పవన్ స్టైల్ అందుకు భిన్నం.
తన బలాన్ని తాను ఓపెన్ గా ఒప్పుకోవటానికి అస్సలు వెనుకాడరు. ఆ మాటకువస్తే అధైర్యపడరు. చివరకు తనను మళ్లీ ఓడించినా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానే తప్పించి.. పారిపోనని తేల్చేశారు. ఇలాంటి మాటలు ఏపీ అధికారపక్షానికి చెందిన వైసీపీ నేతలకు అస్సలు నచ్చలేదు. జనసేన నిర్వహించిన భారీ బహిరంగ సభ పూర్తి అయిన నిమిషాల వ్యవధిలోనే మాజీ మంత్రి పేర్ని నాని మైకు పట్టుకొని పవన్ పై భారీ ఎత్తున తిట్ల పురాణాన్ని విప్పేశారు. అది మొదలు.. శుక్రవారం మొత్తం వైసీపీకి చెందిన పలువురు నేతలు పవన్ వ్యాఖ్యలపై రియాక్టు అయ్యారు.
అయితే.. వీరి నోటి నుంచి వచ్చే మాటలు.. చేస్తున్న ప్రకటనల్ని చూసినప్పుడు అనిపించేదొక్కటే. పవన్ చేసిన వ్యాఖ్యలకు సూటిగా సమాధానాలు చెప్పే కన్నా.. ఏదోలా విషయాన్ని పక్కదారి పట్టించేలా వారి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. పవన్ వేసిన పంచ్ లకు తిరిగి సమాధానం చెప్పేందుకు జనసేనాని విసిరిన వాటి కంటే పవర్ ఫుల్ వ్యాఖ్యలు చేయాల్సిన వైసీపీనేతలు అందుకు భిన్నంగా అడ్డ బ్యాటింగ్ అన్నట్లుగా తమను తాము గొప్ప బ్యాట్స్ మెన్ గా చెప్పుకోవటమే తప్పించి.. వారి నోటి నుంచి వచ్చే మాటల్లో ఏ మాత్రం లాజిక్కులు లేదన్న మాట వినిపిస్తోంది.
తాము చెప్పే మాటలు సాధారణ ప్రజల్నికన్వీన్స్ చేసేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ.. అలాంటిదేమీ లేని తీరు చూస్తే.. వైసీపీ నేతలు కంటెంట్ కంటే కూడా అధినేతను ప్రసన్నం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న వారు..తమకు తోచింది మాట్లాడుతున్నరన్న విమర్శ వినిపిస్తోంది.
పవన్ ప్రసంగానికి స్పందిస్తూ.. దిమ్మ తిరిగేలా కౌంటర్లు ఇవ్వాల్సిన వైసీపీ నేతలు.. అందుకు భిన్నంగా హాహాకారాలు పెట్టినట్లుగా రియాక్టు కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఎంతసేపటికి పాచిపోయిన ప్యాకేజీ మాటలు తప్పించి.. సరైన ఆరోపణ.. విమర్శలు చేసింది లేదన్న మాట వినిపిస్తోంది. పవన్ మాటలపై బలంగా రియాక్టు కావాలన్న దానికి భిన్నంగా వైసీపీ నేతల బ్యాచ్ మాటలు అందుకు భిన్నంగా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.