Begin typing your search above and press return to search.
ఆ సర్జరీ వికటించి.. కూర్చోలేక నిలబడే కోట్లు సంపాదిస్తున్న ఆ మోడల్ !
By: Tupaki Desk | 28 Aug 2021 4:07 AM GMTమోడలింగ్ ప్రపంచంలో ఎదగాలంటే, అందమే కాదు, శరీర ఆకృతి కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మహిళలకి అయితే, అవి రెండూ ముఖ్యమే. అందుకే రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలగాలని కోరుకొనే చాలామంది మోడళ్లు, నటీమణులు, సర్జరీలు చేయించుకుంటూ తమ అందానికి మెరుగులు అడ్డుకుంటున్నారు. ప్రపంచంలో ఏ టెక్నాలజీ కూడా అందుబాటులో లేని రోజుల నుంచే కొంతమంది హీరోయిన్లు తమ ముఖాకృతులను మార్చుకున్నారు. పర్మినెంట్ మేకప్ సర్జరీలు కూడా చేయించుకున్నారనే టాక్ ఉంది.
అయితే, ఇప్పుడు టెక్నాలజీ ఎంతో మారిపోయింది. కేవలం ముఖంలోనే కాదు. శరీర ఆకృతిని కూడా మార్చేసే టెక్నాలజీ వచ్చేసింది. వక్షోజాల నుంచి పిరుదల వరకు ప్రతి ఒక్కటీ కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది ఈ బాటే పడుతున్నారు. తమ రూపురేఖలను మార్చేసుకుంటూ, వాటిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత ఫ్యాన్ పేజీల్లో అందాలను ఆరబోస్తూ బాగానే సంపాదిస్తున్నారు. సినీ ఇండస్ట్రీ లో స్టార్స్ గా కొనసాగిన ఎంతోమంది సర్జరీలు చేయించుకున్నవారే.
ఇదిలా ఉంటే .. ఫ్లోరిడాకు చెందిన మోడల్ సమస్య మిగితా వారికంటే కొంచెం బిన్నం. ఆమె కూడా అందరిలాగానే తన శరీర ఆకారాన్ని మార్చుకోవడం కోసం ఆరాటపడింది. సుమారు రూ.14 లక్షలు వెచ్చించి తన పిరుదులకు సర్జరీ చేయించుకుంది. అయితే, ఆ సర్జరీ ఫెయిల్ కావడంతో ఆమె ఇప్పుడు కూర్చోవాలంటేనే భయపడిపోతోంది. 24 ఏళ్ల కజుమీ స్క్విర్ట్స్ కు ఇదో పెద్ద చేదు అనుభవంగా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోవర్లను ఆకట్టుకోవడం కోసం తన పిరుదులు ఎత్తుగా కనిపించేలా సర్జరీ చేయించుకుంది. అది ఫెయిల్ కావడం వల్ల ఆమె కూర్చోడానికి ఇబ్బంది పడుతోంది.
దీనిపై కజుమీ మాట్లాడుతూ.. సరైన శరీరాకృతి కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాను. సాంప్రదాయమైన డైటింగ్, వ్యాయామాలు చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ, సాధ్యం కాలేదు. దీనితో సర్జరీ ద్వారా నా వక్షోజాలను పెంచుకున్నాను. ఆ తర్వాత బట్ లిఫ్ట్ సర్జరీ చేయించుకున్నాను. కానీ, ఆశించిన ఫలితం రాలేదు. సర్జరీ విజయవంతం కాలేదు అని తెలిపింది. అప్పటి నుంచి తాను కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నానని వెల్లడించింది. నేను ఏ పనిచేసినా నిలబడే చేస్తాను. ఎక్కడైనా కూర్చోవాలంటే పెద్ద పెద్ద పిల్లోస్‌ను నా వెంట తీసుకెళ్తాను. డిన్నర్ చేసేప్పుడు అవి నాకు కాస్త సపోర్ట్‌గా ఉంటాయి. నా పిరుదల మీద ఏ మాత్రం ఒత్తిడి పడినా, అక్కడి కొవ్వు పూర్తిగా నాశనం అవుతుంది. అందుకే ఏడాదిగా నిలుచునే ఉంటున్నా అని తెలిపింది. అయితే, ఆమె కూర్చోలేకపోయినా, అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మారిన తన షేపులతోనే ఓన్లీ ఫ్యాన్స్ పేజ్ ద్వారా డబ్బులు గడిస్తోంది. సర్జరీకి ముందు కంటే ఇప్పుడే ఎక్కువగా సంపాదిస్తున్నానని ఆమె చెబుతోంది. ఒకప్పుడు నెలకు 25 వేల డాలర్లు మాత్రమే లభించేవని, సర్జరీ తర్వాత 2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నానని తెలిపింది.