Begin typing your search above and press return to search.

సంక్షేమం ఇచ్చినా వైసీపీ వోళ్లు సంచులు తేవాల్సిందే..!

By:  Tupaki Desk   |   12 Oct 2022 9:30 AM GMT
సంక్షేమం ఇచ్చినా వైసీపీ వోళ్లు సంచులు తేవాల్సిందే..!
X
వైసీపీ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. ముఖ్యంగా న‌వ‌ర‌త్నాలు.. పేరుతో అర్హులై న ప్ర‌జ‌ల‌కు అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంది. ఇళ్లు నిర్మించి కూడా ఇస్తోంది. అదేస‌మ‌యంలో వేల కొద్దీ రూపాయ‌ల‌ను వివిధ సంక్షేమ ప‌థ‌కాల పేరుతో .. ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాల‌కు జ‌మ చేస్తోంది.

ఈ క్ర మంలో భారీగా అప్పులు కూడా చేస్తోంది. ఇవ‌న్నీ కూడా.. ప్ర‌జ‌ల‌కు పంచేందుకు చేస్తున్న‌వేన‌ని సీఎం జ‌గన్ నుంచి ఆర్థిక మంత్రి వ‌ర‌కు అంద‌రూ ప‌దే ప‌దే చెబుతున్నారు.

మ‌రి.. ఇన్ని ఇస్తున్నా.. ప్ర‌జ‌ల్లో సింప‌తీ ఉందా? ప్ర‌జ‌లు గంప‌గుత్త‌గా.. ఓట్టు వైసీపీకి వేస్తారా? ఇదీ.. ఇప్పు డు.. వైసీపీని తీవ్ర‌స్థాయిలో క‌ల‌వ‌ర‌పెడుతున్న విష‌యం. సీఎం జ‌గ‌న్ విష‌యం ప‌క్క‌న పెడితే.. నియోజ‌క వ‌ర్గాల స్థాయిలో మాత్రం ఎమ్మెల్యేలు హ‌డ‌లి పోతున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నాడి మ‌రో విధంగా ఉందనే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. వాస్త‌వానికి ప్ర‌స్తుతం పింఛ‌న్ల‌ను రూ. 2000ల‌కు పైగానే జ‌గ‌న్ స‌ర్కారు ఇస్తోంది.

అయితే.. వృద్ధులు.. ఇత‌ర‌త్రా వ‌ర్గాలుమాత్రం.. ''పెంచిందెంత‌?'' అనే ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. ఇక‌, ర‌హ‌దారుల దుస్థితిని ఎంత త‌క్కువ చెప్పుకొన్నా.. మంచిదే అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. దీంతో క్షేత్ర‌స్థా యిలో నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తుంటే.. ఆయా స‌మ‌స్య‌ల‌నే ఏక‌రువు పెడుతున్నారు. పైకి అంతా బాగుంద‌ని అంటున్నా.. ప‌రిస్తితి మాత్రం ఏమంత బాగాలేద‌ని.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో నాయ‌కులు అభిప్రా యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎన్ని చేసినా.. ప్ర‌జ‌ల్లో ఒక‌విధ‌మైన వ్య‌తిరేక చ‌ర్చ అయితే.. సాగుతోంద‌ని అంటున్నారు. దీనిని క‌ట్ట‌డి చేయ‌డమా.. లేక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను మెప్పించేందుకు మ‌ళ్లీ సంచులు తీసుకురాక త‌ప్ప‌దా.? అని ఎమ్మెల్యేలు.. చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. ఇన్ని చేస్తున్నాం కాబ‌ట్టి.. పార్టీ ప‌రంగా.. మీకు ఏమీ ఇచ్చేది లేద‌ని.. అధిష్టానం చూచాయ‌గా చెబుతోంది.

ప్ర‌భుత్వం చేస్తున్న మేలును ప్ర‌చారం చేసుకోవాల‌ని అంటోంది. కానీ, ఆ మేలు విష‌యంలోనే తేడా కొడుతోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు సంచులు తేవాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌ద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారోచూడాలి.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.