Begin typing your search above and press return to search.

అబద్ధం చెప్పని అక్కడ.. వారిని ఫోటోలు తీస్తే ముఖాన ఉమ్మేస్తారు

By:  Tupaki Desk   |   15 March 2021 7:32 AM GMT
అబద్ధం చెప్పని అక్కడ.. వారిని ఫోటోలు తీస్తే ముఖాన ఉమ్మేస్తారు
X
అండమాన్ నికోబార్ దీవులు. మన దేశంలోనే ఉన్నా.. అక్కడకు వెళ్లే వారు తక్కువే ఉంటారు. ఇటీవల కాలంలో ఇక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువైంది. మిగిలిన పర్యాటక ప్రాంతాలకు భిన్నంగా.. దేశంలో మరెక్కడా లేని అనుభవాలు.. అనుభూతులు ఇక్కడ లభిస్తాయి. అండమాన్ ప్రజలు అబద్ధాలు చెప్పరు. నిజాయితీగా ఉంటారు. ఎవరిని మోసం చేయరు. ఎవరైనా వస్తువులు మర్చిపోతే.. వాటిని ముట్టుకోరు సరికదా.. మనది కాని వస్తువు కనిపించినంతనే పోలీసులకు అప్పగిస్తారు.

ఇంతకీ ఇక్కడి స్థానికులు అంటే.. వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఉండే ఆటవిక జాతుల్ని మినహాయిస్తే.. మిగిలిన వారంతా అండమాన్ లో నిర్మించిన జైల్లో పని చేయటానికి వచ్చిన సిబ్బందే.. ఊరుగా మారింది. ఇక్కడ సెటిల్ అయిన వారిలో ఎక్కువగా బెంగాలీలు.. తమిళులు.. తెలుగువారు కనిపిస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతి అడుగుకో ఫోటోలు తీసే అలవాటు ఉన్న వారంతా.. ఇక్కడ చాలా జాగ్రత్తగా.. అప్రమత్తంగా ఉండాలి.

అండమాన్ లోని జార్వాన్ అనే ఆటవిక తెగల వారి విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. వీరిని అస్సలు ఫోటోలు తీయకూడదు. ఒకవేళ.. తీసే ప్రయత్నం చేస్తే.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. 40కిలోమీటర్ల వేగంతో వెళుతున్న వాహనం నుంచి వారిని ఫోటోలు తీసినా.. వారు వెంటబడి మరీ వచ్చి.. ముఖాన తుపుక్కున ఉమ్మేస్తాడు. అంత తీవ్రంగా రియాక్టు అవుతారు. తమను ఫోటోలు తీయటాన్ని వారు అస్సలు ఇష్టపడరు సరికాదా.. తీవ్రమైన కోపానికి గురి అవుతారు. సో.. అండమాన్ కు వెళ్లే వారు ఎవరైనా సరే.. ఎక్కడ ఫోటోలు తీసుకోవాలన్న విషయంపై అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.