Begin typing your search above and press return to search.
పది కూడా పాస్ కాలే.. డాక్టర్ అవతారమెత్తిండు..!
By: Tupaki Desk | 23 Nov 2022 2:30 AM GMTపదో తరగతి కూడా పాస్ అవని ఓ వ్యక్తి ఏకంగా వైద్యుడి అవతారం ఎత్తాడు. గత పదేళ్లుగా అల్లోపతి.. ఆయుర్వేదం పేరుతో అతడు వేలాది మందికి వైద్యం అందిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అతడి వద్ద వైద్యం తీసుకున్న పలువురికి అనుమానం వచ్చింది. సరైన అర్హతలు లేకుండానే వైద్యం చేస్తున్నాడని అతడిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ వైద్యుడి గుట్టు రట్టు చేశారు. ఈ ఘటన జనగామ జిల్లాలో సంచలనంగా మారింది. పదేళ్లుగా ఓ వ్యక్తి అర్హతలు లేకుండా వైద్యం అందిస్తున్నాడనే విషయం తెలియడంతో వారంతా అవాక్కవుతున్నారు. పోలీసుల కథనం మేరకు సంఘటన వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కత్తాకు చెందిన ఆకాశ్ కుమార్ బిశ్వాస్ పదో తరగతి కూడా పాస్ కాలేదు. అయితే కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నాడు. గత పదేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లిలో క్లినిక్ ఏర్పాటు చేశాడు. ఇండియన్ ఆయుర్వేదిక్ మెడిక్ అనే బోర్డు తగిలించుకొని వైద్యం ప్రారంభించాడు.
ఆపరేషన్ లేకుండానే మందులతోనే జబ్బు నయం చేస్తానని చెప్పి రోగులకు వైద్యం అందించేవాడు. అల్లోపతి.. ఆయుర్వేదం వైద్యం పేరుతో మందులు ఇచ్చేవాడు. తన మందులతో రోగం నయం కాకుంటే కమీషన్ ప్రాతిపదికన ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేసేవాడు. ఈక్రమంలోనే అతడిపై పోలీసులకు పలు ఫిర్యాదు వచ్చాయి.
ఈక్రమంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు.. డీఎంహెచ్ఓ శివునిపల్లిలోని ప్రియాంక క్లినిక్ లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అతడి వద్ద డాక్టర్.. సంబంధిత వైద్య ధృవీకరణ పత్రాలేవీ లేవని తేలింది. దీంతో పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ నకిలీ వైద్యుడు ఫైల్స్.. ఫిషర్స్.. బ్లీడింగ్ పైల్స్.. ఫిస్టులాకు సంబంధించి సర్జరీ లేకుండానే వైద్యం చేస్తున్నట్లు తేలింది.
రూ. 100 కన్సల్టెన్సీ ఫీజును తీసుకొని వైద్యం అందించేవాడని గుర్తించారు. గత పదేళ్లలో 3,650మంది అతడి వద్ద వైద్యం చేయించుకున్నారని పోలీసులు గుర్తించారు. కమిషన్ ప్రాతిపదికన మూడు నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు ఈ నకిలీ వైద్యుడు రెఫర్ చేసి కమిషన్ తీసుకునేవాడని తేలింది.
ఏది ఏమైనా గత పదేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా వైద్యం అందిస్తున్న ఆకాశ్ అసలు బాగోతాన్ని పోలీసులు ఎట్టకేలకు కట్టించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.