Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర అసెంబ్లీ లో ఎవర్ గ్రీన్ సీన్లు

By:  Tupaki Desk   |   27 Nov 2019 4:30 AM GMT
మహారాష్ట్ర అసెంబ్లీ లో ఎవర్ గ్రీన్ సీన్లు
X
మహారాష్ట్ర లో బీజేపీ సర్కారు కుప్పకూలడంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల కూటమి గద్దెనెక్కబోతోంది. బుధవారం ఉదయం ఈమేరకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. మొదట నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 288 మంది ఎమ్మెల్యేల ప్రమాణం నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కోలాహలం నెలకొంది.

మహారాష్ట్ర లో కొత్త సంకీర్ణ సర్కారు ఏర్పడబోతోంది. 288 మంది ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరం మహారాష్ట్ర నూతన సీఎంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నవంబరు 28న ప్రమాణం చేయబోతున్నారు. ఉదయం 9 గంటలకు గవర్నర్ కోష్యారీ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే భేటి అయ్యారు. అంతకుముందు శివసేన వ్యవస్థాపకుడు , తండ్రి అయిన బాలా సాహెబ్ థాక్రే కు ఉద్దవ్ ఘనంగా నివాళులర్పించారు.

ఇక సంకీర్ణ సర్కారు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియో సూలే అసెంబ్లీలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ముందుగానే అసెంబ్లీకి చేరుకున్న ఆమె నేతలకు స్వాగతం పలుకుతున్నారు. మొదట తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే అసెంబ్లీకి రాగా ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఇక ఆ తర్వాత బీజేపీలోకి ఫిరాయించి మళ్లీ మనసు మార్చుకొని తిరిగి వచ్చిన తన సోదరుడు ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ను కూడా సుప్రియో స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ వెన్నుతట్టారు. మాజీ సీఎం ఫడ్నవీస్ తో మర్యాదపూర్వకంగా సుప్రియ సూలె కరచాలనం చేశారు.

సంకీర్ణ సర్కారు మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయని.. మహారాష్ట్ర ప్రజలంతా తమకు అండగా నిలబడ్డారని సుప్రియో సూలే అన్నారు. వాటిని నెరవేర్చడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఇక రైతు రుణమాఫీ తమ ఎజెండా లో ప్రముఖమైందని అన్నారు.

20 ఏళ్లపాటు ఇలాగే ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుందని ఎన్సీపీ ప్రకటించింది. మహారాష్ట్రకు సుస్థిర పాలన అందిస్తామని తెలిపింది.