Begin typing your search above and press return to search.
ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ
By: Tupaki Desk | 11 May 2022 4:24 AM GMTమన దేహంలో అధిక రక్తపోటు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతోంది. కేవలం అధిక రక్తపోటు వల్లే మరణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో దేశంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశంలో హైబీపీకి సంబంధించి కొత్త నివేదికను విడుదల చేశారు. ఇండియన్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ రిపోర్ట్ పేరుతో విడుదలైన నివేదికలో అధిక రక్తపోటుకు జాతీయస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని నివేదించింది. పరిస్థితి ప్రమాదకరస్థాయిలో ఉందని దేశంలో ఉన్న పెద్దవారిలో ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ ఉన్నట్టు రిపోర్టు ద్వారా బయటపెట్టింది.
ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (ఐహెచ్సీఐ) అనేది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియా బ్రాంచ్ కలిసి నిర్వహించిన ప్రాజెక్ట్. 2017లో పెరిగిన రక్తపోటు కేసులను తగ్గించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు.
మొదటగా పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వేలను నిర్వహించారు. అక్టోబర్ 2021 నాటికి 19 రాష్ట్రాల్లోని 100కు పైగా జిల్లాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించారు. ఇండియాలోని పెద్దల్లో అధికశాతం మందిలో హైబీపీ ఉన్నట్టు పాత నివేదికలు ఎప్పుడో చెప్పాయి.
నియంత్రణలో ఉంచుకునేట్టు చేయడం.. హైబీపీ రోగుల సంఖ్య తగ్గేలా చైతన్యం పెంచేందుకు ఈప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో హైపర్ టెన్షన్ కేసుల్లో నాలుగు రెట్లు ఎక్కువ నియంత్రణ పెరిగినట్టు గుర్తించారు. హైబీపీ నియంత్రణలో ఉంచుకుంటున్న రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
గతంతో పోలిస్తే హైబీపీ నియంత్రణలో ఉంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. హైబీపీ బారిన పడిన రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్టు గుర్తించింది ఈ సర్వే. భారతదేశ జనాభాలో పెద్దవారిలో ప్రతి నలుగురిలో ఒకరు హైబీపీ రోగులుగా ఉన్నట్టు బయటపడింది. ఇది కాస్తా ఆందోళన కలిగించే అంశమే.
అధిక రక్తపోటు పెరిగితే తలనొప్పి అధికంగా వస్తుంది. నిద్ర పట్టకపోవడం.. చూపు మసకబారడం.. విపరీతమైన అలసట.. చెవ్వుల్లో శబ్దాలు వినిపించడం.. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడడం.. గుండెల్లో దడగా అనిపించడం.. తికమకగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణ వ్యక్తిలో రక్తపోటు 120/80గా ఉంటుంది. హైపర్ టెన్షన్ వారిలో 130/90 కన్న అధికంగా ఉంటుంది.