Begin typing your search above and press return to search.
ఎవరీ గోల్డ్ మైన్ శ్రీనివాసరావు.. లిక్కర్ స్కాంలోకి కొత్త పేరు
By: Tupaki Desk | 20 Sep 2022 5:31 AM GMTచూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కారం రానున్న రోజుల్లో తీవ్ర రాజకీయ కలకలానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతుందా? ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని.. పక్కాగా అన్ని చెక్ చేసుకున్న తర్వాతే దీన్ని టచ్ చేసినట్లుగా చెబుతున్నారు. గడిచిన మూడు వారాలుగా ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి వార్తలు రావటం తెలిసిందే. అప్పటి నుంచి పెద్దగా వినిపించకుండా.. అసలు ప్రస్తావనే లేని గోల్డ్ మైన్ శ్రీనివాసరావు పేరు అనూహ్యంగా తెర మీదకు రావటమే కాదు.. ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకొని ఆరు గంటల పాటు విచారించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
అంతేకాదు.. ఆయనకు చెందిన ఆఫీసుల్లో సోదాలుజరిపిన నేపథ్యంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన పాత్ర ఎంత కీలకమన్న విషయం తాజాగా బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆరు గంటల పాటు సాగిన ఈడీ విచారణలో పలు అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదటి వికెట్ గోల్డ్ మైన్ శ్రీనివాసరావేనని.. ఆయన్ను విచారణలోకి తీసుకురావటంలో ఈడీ విజయవంతమైందని చెబుతున్నారు. ఈ స్కాంకు సంబంధించిన కీలక ఆధారాల్ని సేకరించటమే కాదు.. ఫిక్సు చేయాల్సిన రీతిలో పిక్సు అయినట్లేనని చెబుతున్నారు.
ఇంతకీ ఈ గోల్డ్ మైన్ శ్రీనివాసరావు ఎవరు? బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ పేరు.. ఇప్పుడీ స్కాంలోకి ఎలా వచ్చింది? ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏమిటి? ఆయనేం చేస్తుంటారు? ఎవరితో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల్ని చూస్తే.. కీలక అంశాలు వెలుగు చూస్తాయని చెప్పక తప్పదు. తాజాగా ఆయన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించటమే కాదు.. ఆయన్ను విచారించిన తీరుతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ వికెట్ గా అభివర్ణిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సోమవారం వరకు గోల్డ్ మైన్ శ్రీనివాసరావు పేరు తెర మీదకు రాలేదు. ప్రముఖంగా వినిపించిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై.. బోయినిపల్లి అభిషేక్ రావు.. గండ్ర ప్రేమ్ సాగర్ రావు.. ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లోనూ.. ఆఫీసుల్లోనూ ఈడీ టీంలు సోదాలు నిర్వహించాయి కానీ.. శ్రీనివాసరావు పేరు మాత్రం రాలేదు. మిగిలిన వారి ఆఫీసుల్లోనూ.. ఇళ్లల్లోనూ తనిఖీలు జరిగితే.. గోల్డ్ మైన్ శ్రీనివాసరావును ఏకంగా విచారణకు తీసుకెళ్లి.. ఆరు గంటల పాటు విచారించిన వైనం చూస్తే.. ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు.
శ్రీనివాసరావు ఎవరు? అతగాడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయాల్లోకి వెళ్లినప్పుడు అతనిది ప్రస్తుత సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతగల్ గ్రామంగా చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ ముఖ్యనేతల అండదండలతో అతగాడు ఆర్థికంగా ఎదిగినట్లు చెబుతారు. అతగాడికి పవిత్ర పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్.. హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్.. రామాంతపూర్ లో సాలిగ్రామ్ ఐటీ కంపెనీ.. మాదాపూర్ లో వరుణ్ సన్ షోరూంలతో పాటు రంగారెడ్డి జిల్లాలో గోల్డ్ స్టార్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థలు అతనికి ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల రామాంతపూర్ లోని ఏర్పాటు చేసిన సాలిగ్రామ్ టెక్నాలజీస్ సంస్థ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ కవిత హాజరైనట్లుగా చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రన్ పిళ్లైను విచారించిన సందర్భంలోనే శ్రీనివాసరావు పేరు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. పిళ్లైను విచారించిన సమయంలో అతని ఫోన్ లోని సిగ్నల్ యాప్ ద్వారా జరిగిన సంభాషణల్ని గుర్తించిన ఈడీ అధికారులు వాటిని రిట్రైవ్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసరావుతో చేసిన సంభాషణతో కొత్త పేరు తెర మీదకు రావటం.. వారి మధ్య సంభాషణ కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి చాటింగ్ కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను ఢిల్లీ లిక్కర్ స్కాంలో వినిపిస్తున్న ప్రముఖల మొబైల్ ఫోన్లకు కూడా వెళ్లిన విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతకు వెళ్లినట్లుగా చెబుతున్న రూ.200 కోట్లు శ్రీనివాస్ రావు ద్వారానే చేరినట్లుగా అనుమానిస్తున్నారు. ఇంత భారీ మొత్తం ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న కోణంలో ఈడీ విచారణ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ దందాకు కావాల్సిన కంపెనీలు.. వేయాల్సిన టెండర్లు.. ముట్టజెప్పాల్సిన సొమ్ము.. కట్టాల్సిన సొమ్ముసమీకరణ బాధ్యతను శ్రీనివాసరావుకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
అయితే.. హైదరాబాద్ టు ఢిల్లీ అన్నట్లు సాగిన ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న కీలక పాత్ర ఎవరిది? వారికి ఈ వ్యవహారంతో ఉన్న లింకేమిటి? అన్నదిప్పుడు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశంగా చెబుతున్నారు. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి గోల్డ్ మైన్ శ్రీనివాస్ రావు ప్రధానమైన వికెట్ గా అభివర్ణిస్తున్నారు. లిక్కర్ స్కాం లెక్క తేల్చే విషయంలో ఈడీకి గోల్డ్ మైన్ శ్రీనివాసరావును విచారించిన సందర్భంలో బయటకు వచ్చిన వివరాలు రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.