Begin typing your search above and press return to search.
షాకింగ్ నివేదిక.. ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి!
By: Tupaki Desk | 7 April 2023 8:00 AM GMTప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన తాజా నివేదికలో బాంబుపేల్చింది. మొత్తం వయోజన జనాభాలో 17.5 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఈ సమస్యను అధిగమించేందుకు సంతాన సాఫల్యత చర్యలను చేపట్టాలని సూచించింది. అవి అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కోరింది.
సాధారణంగా 12 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం దంపతులు కలుసుకున్నా గర్భం దాల్చని పరిస్థితిని వంధ్యత్వంగా పేర్కొంటారు.
సంతానలేమి సమస్య కేవలం పేద దేశాల్లోనే లేదని.. అన్ని దేశాల్లోనూ ఈ సమస్య ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ సమస్యకు ప్రాంతాలతో సంబంధం లేదని వెల్లడించింది. పేద దేశాలతోపాటు ధనిక, మధ్య ఆదాయం ఉన్న దేశాల్లో కూడా ఈ సమస్య ఉందని సంచలన నివేదిక విడుదల చేసింది.
సంతాన లేమి రేటు అధిక ఆదాయ దేశాల్లో ఇది 17.8 శాతం ఉంది డబ్ల్యూహెచ్వో పేర్కొంది. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో సంతాన లేమి రేటు 16.5 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఇంత మంది సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నందువల్ల సంతాన సాఫల్యత సౌకర్యాలను విస్తరించాలని కోరింది. వాటిని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలని సూచించింది. ఇందుకు తక్కువ వ్యయం, భద్రతతో కూడిన విధానాలను తేవాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అద్నాం గేబ్రియేసన్ తెలిపారు.
సంతానలేమి భార్యాభర్తల మధ్య మనోవేదనకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రజల మానసిక శ్రేయస్సుపై కూడా ప్రభావం చూపిస్తుందని వివరించింది. అలాగే ఆర్థిక ఇబ్బందులకు కూడా దారితీస్తుందని పేర్కొంది.
సంతానలేమిని నివారించడానికి ఉన్న ఐవీఎఫ్ చికిత్స పరిమితంగానే అందుబాటులో ఉండటం, ఎక్కువ వ్యయం అవుతుండటం ఇబ్బందికరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
సంతానం కనడం కోసం ఐవీఎఫ్ చికిత్స కోసం భారీగా ఖర్చు దంపతులు ఖర్చు చేస్తున్నారని తెలిపింది. దీంతో కోట్ల మంది పేదరికంలో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అత్యుత్తమ పాలసీలు, ప్రభుత్వ నిధుల కేటాయింపు ద్వారా ప్రజలు పేదరికంలోకి జారిపోకుండా కాపాడుకోవచ్చని పేర్కొంది.