Begin typing your search above and press return to search.
ఆ ఊళ్లో ప్రతి ఇంటికో విమానం
By: Tupaki Desk | 26 Oct 2015 10:30 PM GMTఇంటికో బైక్ ఉండటమే గొప్ప. అలాంటిది ఒక గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక కారు ఉంటే మహా గొప్ప. కానీ.. ప్రతి ఇంటికి ఒక విమానం ఉంటే? ఏ మాత్రం సాధ్యం కాదని చెబుతారు కానీ.. అమెరికాలోని ఒక గ్రామంలో మాత్రం ఇది చాలా మామూలైన విషయం. సదరు గ్రామంలోని వారి వ్యవహారం అంతా కాస్త విచిత్రంగా ఉంటుంది. ఆ గ్రామంలో ఉండే వారంతా డబ్బులున్న అసాములే కావటం ఒక విశేషం. నిజానికి ఇంటికో విమానం కాదు.. కొందరికైతే రెండు.. మూడు విమానాలున్న అసాములు కూడా ఉంటారు. మొత్తంగా ఆ ఊళ్లో ఉండే ప్రతిఒక్కరికి ఒక విమానం అయితే పక్కా. ఇక.. ఈ ఊరిని విహంగ వీక్షణంతో చూస్తే.. రోడ్ల మీద విమానాలు చిన్నచిన్న బొమ్మలు పేర్చినట్లుగా కనిపిస్తుంటాయి.
మరింత రిచ్ వాళ్లు ఉండే ప్లేస్ అమెరికాలోనే ఉంది. ఆ దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ‘స్ర్పూస్ క్రీక్’ అనే ఊరుంది. ఆ ఊళ్లో మొత్తం జనాభా మొత్తం 6వేల మంది. వీరందరికి విమానాలంటే విపరీతమైన ఆసక్తి. ఎంత అంటే.. వీరిలో ఏ ఇద్దరు కలిసినా ఎక్కువసేపు మాట్లాడుకునేది విమానాల గురించే. ఇక.. ఊళ్లో ఇళ్లను చూసినోళ్లకు మతి పోవాల్సిందే. ఎందుకంటే.. ప్రతి ఇంటికో విమానం తప్పనిసరి. కొంతమందికి అయితే.. రెండు మూడు విమానాలు కూడా ఉంటాయి మరి.
డబ్బులున్న మారాజులు ఎంత విలాసంగా ఉంటారో తెలిసిందే కానీ.. ఈ ఊరు వాసుల విలాసం చూస్తే.. డబ్బులున్న వారు సైతం అసూయ చెందటం ఖాయం. ఎందుకంటే.. వీరు టిఫిన్ చేయటం కోసం విమానాల్ని వినియోగిస్తుంటారు. ప్రతి శనివారం సరదాగా టిఫిన్ కోసం ఫ్లైట్ వేసుకొని దగ్గర్లోని ఎయిర్ పోర్ట్ కి వెళ్లి సరదాగా.. మిత్రుల్నికలిసి వారితో ముచ్చట్లు చెప్పుకుంటూ టిపిన్ పూర్తి చేస్తుంటారు. ఇక..ఈ ఊరి వారిలో మరో ప్రత్యేకత ఉంది. వారికి విమానాలతోపాటు.. నిపుణులైన కారు.. బైక్ రేసర్లు చాలామందే ఉంటారు. ఇక్కడ ప్రతివారం బైక్ రేస్ కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడ నిర్వహించే బైక్ రైస్ చాలానే ప్రాధాన్యత ఇస్తుంటారు. మరిన్ని ఆకర్షణలు ఉన్న ఈ ఊరిని చూసేందుకు.. వీరి వైభోగం చూసేందుకు పర్యాటకులు కూడా బాగానే వస్తుంటారు.