Begin typing your search above and press return to search.
ఐపీఎస్ గా వస్తా అందరి లెక్కలు తెలుస్తా : లేడీ సింగం
By: Tupaki Desk | 16 July 2020 11:30 AM GMTఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన న్యూస్ ఏదైనా ఉంది అంటే .. అది గుజరాత్ కానిస్టేబుల్ ఘటనే. లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదు అని ,మంత్రి కుమారుడికి చుక్కలు చూపించింది గుజరాత్ మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈమె తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరో సంచలనానికి తెరతీసింది. మళ్లీ ఇదే డిపార్ట్మెంట్ లోకి తిరిగి లాఠీతో వస్తానని, ఈసారి ఐపీఎస్ గా అడుగుపెడతానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. రాజకీయాలు, పోలీసు అధికారుల విధులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఇప్పటివరకు మీడియాలో వచ్చింది కేవలం 10 శాతం మాత్రమేనని.. తన వద్ద ఇంకా 90 శాతం విషయాలు ఉన్నాయన్న ఆమె ,తన
రాజీనామా ఆమోదించిన తరువాత అన్ని విషయాలను ప్రజల ముందు పెడతానని చెప్పారు. ఆ తరువాత జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ‘అందరు నన్ను లేడీ సింగం అంటున్నారు. కానీ కాదు.. నేను సాధారణ లోక్ రక్షక్ దళ్ అధికారిణిని. ఖాకీ యూనిఫాంలో అబద్ధం ఉందని ఇంతకుముందు అనుకునేదాన్ని. కానీ, అది ఉద్యోగానికి సంబంధించిన ర్యాంక్‌లో ఉందని ఈ ఘటన నిరూపించింది. అందుకే నేను ఐపీఎస్‌కు ప్రిపేర్ కావాలనుకుంటున్నాను. సమస్య తేలిగ్గానే పరిష్కారం అయ్యేది. కానీ సరైన ర్యాంక్ లేకపోవడం వల్ల నన్ను ఇప్పుడు బబుల్‌గమ్‌లా నమిలేస్తున్నారు అని సునీతా యాదవ్ చెప్పారు.
అలాగే , ఈ యుద్ధంలో నేను మరణించినా నాకు ఎలాంటి విచారం ఉండదు. నా తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారుల నుంచి నాకు మద్దతు ఉన్నది’ అని సునీతా యాదవ్ తెలిపారు. ప్రస్తుతం సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నానను. ఐపీఎస్‌గా ఎంపికై తిరిగి పోలీసు శాఖలోకి వస్తాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఎల్‌ఎల్‌బీ చేస్తాను.. లేదా జర్నలిస్ట్‌ను అవుతాను’ అని సునీతా యాదవ్ వెల్లడించారు. మంత్రి అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆమె కోరారు. నాకు ఫోన్‌లో కొన్ని బెదిరింపులు వచ్చాయి. ‘మీరు దేశం కోసం చాలా చేస్తున్నారు.. ఎక్కువ కాలం జీవిస్తారని అనుకోవడం లేదు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి వారికి తగిన పాఠం చెబుతా’ అని సునీతా యాదవ్ అన్నారు.