Begin typing your search above and press return to search.

అన్నీ పెంచారు... అయినా ఆదాయం చాలదు

By:  Tupaki Desk   |   7 April 2022 6:38 AM GMT
అన్నీ పెంచారు... అయినా ఆదాయం చాలదు
X
మద్యంపై అధిక ధరలు, చెత్త ప‌న్ను, బస్సు, కరెంటు ఛార్జీలు.. ఇత‌రేత‌ర ప‌న్నులు ఇవి కాకుండా యూజ‌ర్ ఛార్జీలు ఇన్ని పెంచినా కూడా నిధులు చాలక మరిన్ని ఇవ్వ‌మ‌ని, మరింత అప్పు ఇవ్వమని జ‌గ‌న్ ప‌దే ప‌దే కోరుతున్నారు. ఇదే ఇప్పుడు కుద‌ర‌ని ప‌ని అని కేంద్రం అంటోంది. స‌వ‌రించిన అంచ‌నా వ్య‌యం అనుసారం కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోదు. అంతేకాదు రుణ ప‌రిమితి కూడా జ‌గ‌న్ కోరుకున్న విధంగా పెర‌గ‌డం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌ని ప‌ని. అయినా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రాన్ని క‌లిస్తే కాస్తో కూస్తో క‌రుణిస్తుంద‌ని జ‌గ‌న్ అండ్ కో ఆశ‌.

అప్పుల్లో ఉన్న ఆంధ్రాను ఆదుకోవ‌డం కేంద్రానికి సాధ్యం కాని ప‌ని. రుణ‌భారం త‌ల‌కుమించి ఉన్నా కూడా ప‌థ‌కాల ప్రక‌ట‌న‌లు ఆగ‌డం లేదు అన్న‌ది అంగీక‌రించ‌ద‌గ్గ వాస్త‌వం. ఈ స్థితిలో ఏటా ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను సంక్షేమానికే వెచ్చిస్తూ ఉంటే కొత్త‌గా నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయి అన్న ప్ర‌శ్న‌కు వైసీపీ ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. అభివృద్ధి మ‌రియు సంక్షేమం ఈ రెండూ త‌మ‌కు రెండు క‌ళ్లు అని అప్ప‌ట్లో చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం రూటు మార్చి సంక్షేమ‌మే త‌న‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్యం అని తేల్చేశారు.

క‌రోనా త‌రువాత రాష్ట్ర ఆర్థిక ప్ర‌గ‌తి ఎంతో గాడిన ప‌డింది. ఊహించ‌ని విధంగా అధికారుల‌పై ఒత్తిడి ఉన్న కార‌ణంగా ప‌న్నుల వ‌సూళ్లు అదిరిపోయాయి. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇంటి ప‌న్ను రూపంలోనే 1414 కోట్లు వ‌చ్చాయి. ఇక వినోద‌పు ప‌న్ను రూపేణా 1000 కోట్లు రూపాయ‌లు వ‌సూలు కావాల‌న్న‌ది జ‌గ‌న్ టార్గెట్. ఆ టార్గెట్ ను కూడా ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు తీర్చేయ‌నున్నాయి.

టికెట్ 12 శాతం జీఎస్టీ ఉంది. దీంతో పాటు ఈ సారి ఇతర ప‌న్నులు కూడా వేశారు. ఎలా చూసుకున్నా ఒక టికెట్ కు ప్ర‌భుత్వానికి 30 రూపాయ‌లు నుంచి 60 రూపాయ‌లు వెళ్లినా చాలు. స‌ర్కారుకు కాసులే కాసులు ఎందుకంటే టికెట్ కు ముందుగా నిర్ణ‌యించిన ధ‌ర 250 నుంచి 500 వంద‌ల వ‌ర‌కూ వ‌సూలు అయింది. ఆ లెక్క‌న చూసుకున్నా ఇప్ప‌టిదాకా వెయ్యి కోట్లు వ‌సూలు అయింది ఇందులో 12 శాతం.. అంటే ఎన్ని కోట్లు 120 కోట్లు ఈ మొత్తం ఏం చేస్తారని? ఇంత జ‌రిగినా కూడా నిధులు లేవు అప్పులకు సంబంధించి ప‌రిమితి పెంచండి అని మాత్ర‌మే చెబుతున్నారు.

ఇదే నిన్న‌టి వేళ మోడీకి జ‌గ‌న్ విన్న‌వించింది.అంతేకాకుండా పోల‌వ‌రం స‌వ‌రించిన ధ‌ర‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అందుకు అనుగుణంగా నిధులు ఇవ్వాల‌ని కోరారు. అయితే కేంద్రం మాత్రం ఇబ్బడిముబ్బ‌డిగా ఆదాయం వ‌స్తున్నా ఆ రోజు క‌రోనా సాకుతో కొంత ఆదుకున్నామ‌ని అయినా కూడా ఆ రోజు తాము వద్ద‌న్నా ఉచిత ప‌థ‌కాలు అమలు చేశార‌ని అంటోంది.

ఇప్పుడు పోల‌వ‌రానికి సంబంధించి కూడా ప‌నుల్లో జాప్యాన్ని నివారించ‌కుండా ఇబ్బడి ముబ్బ‌డిగా అంచ‌నా వ్య‌యం పెంచుకుంటూ వెళ్తున్నార‌ని అలాంట‌ప్పుడు తామెందుకు నిధులు పెంచుతూ నిర్ణ‌యాలు తీసుకోగ‌ల‌మ‌ని కేంద్రం ప్ర‌శ్నిస్తోంది. అందుకే ఢిల్లీకి జ‌గ‌న్ వెళ్లిన ప్ర‌తిసారీ ఏమీ సాధించ‌కుండానే వెనుదిరిగి వ‌స్తున్నార‌ని టీడీపీ అంటోంది.