Begin typing your search above and press return to search.
గుజరాత్ కే అన్నీ.. మోడీ షాలు తలుచుకుంటే ఇలా మారిపోతాయి!
By: Tupaki Desk | 16 Sep 2022 2:30 AM GMTదేశంలోని పవర్ పుల్ వ్యక్తులిద్దరూ గుజరాతీలే. ఇలా ఉండడం అనైతికం. కానీ ఉంటున్నారు. ఎందుకంటే దేశాన్ని పాలించే పార్టీ వారిదే.. మోడీ షాలను మించి ఈ దేశంలో గొప్పోళ్లు లేరు. వారిద్దరే దేశంలో చక్రం తిప్పుతున్నారు. అందుకే పెట్టుబడులు,. అభివృద్ధి అంతా వారిద్దరి ఏకైక రాష్ట్రమైన గుజరాత్ కే తరలిపోతున్నాయి. ఇది అందరూ ఆరోపిస్తున్న ఆరోపణ కాదు.. చేదు నిజం.
మహారాష్ట్రలో శివసేన సర్కార్ ఉండగా.. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తొలిసారి సెమీ కండక్టర్ల ప్లాంట్ ఏర్పాటుకు ‘వేదాంత-ఫాక్స్ కాన్’ జాయింట్ వెంచర్ చర్చలు జరిపింది. రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడుల ఈ భారీ ప్రాజెక్ట్ మహారాష్ట్రకేనని ఫిక్స్ అయిపోయారు. ఇతర రాష్ట్రాలు పోటీపడినా కూడా ఆర్థికరాజధాని ముంబై ఉండడంతో ఆ కంపెనీ అటే మొగ్గుచూపింది.
కానీ కట్ చేస్తే.. మహారాష్ట్రలో శివసేన సర్కార్ కూలిపోయి బీజేపీ నేతృత్వంలో ఏక్ నాథ్ శిండే సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడే చక్రం తిప్పారు మోడీ షాలు.. సొంత గుజరాత్ కోసం.. సామంత మహారాష్ట్ర సర్కార్ ను బలిపెట్టినట్టుగా పలువురు ఆరోపిస్తున్నారు.
వేదాంత-ఫాక్స్ కాన్ లక్షన్నర కోట్ల అతిపెద్ద ప్రాజెక్టు ఇప్పుడు గుజరాత్ కు తరలిపోయింది. దేశంలోనే తొలి సెమీ కండక్టర్ల పరిశ్రమ మోడీషాల సొంత రాష్ట్రానికి షిఫ్ట్ అయ్యింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం 1000 ఎకరాలు కేటాయించి ఎంవోయూ కూడా కుదుర్చుకుంది.
దీనిపై మహారాష్ట్రలో గగ్గోలు మొదలైంది. మోడీ షాలు మహారాష్ట్రకు అన్యాయం చేసి సొంత రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తరలించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్రలోని అధికార బీజేపీ నేతలు మాత్రం కిక్కురుమనకుండా ఉంటున్నారు. అరిస్తే మోడీ షాలకు కోపం.. అరవకపోతే మహారాష్ట్ర ప్రజలకు కోపం.. ఇలా మధ్యలో నలిగిపోతున్నారు.
మోడీ షాలు మహారాష్ట్ర నుంచి మాత్రమే కాదు.. తెలంగాణకు కేటాయించిన కొన్ని ప్రాజెక్టులను సైతం గుజరాత్ కు తరలించారు. ఖాజీపేట్ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ 21969 కోట్లతో ఏర్పాటుకు ఓకే చెప్పగా.. దాన్ని గుజరాత్ కు తరలించారు. గుజరాత్ లో ధోలెలా, గిఫ్ట్ సిటీల పేరిట రెండు అతిపెద్ద నగరాలు కడుతున్నారు. అమరావతిని మించి నిర్మిస్తున్నారు. వీటన్నింటికి కేంద్రం నిధులు, ఇతర రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులను మళ్లించి వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మోడీ షాల తీరుతో వెనుకబడి రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం కుక్కిన పేనులా నలిగిపోతున్నాయి. దేశంలో ఒక్క గుజరాత్ కే ఇలా దోచిపెట్టడం ఏంటని అందరూ నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. గుజరాతీలే పాలిస్తే అంతే ఉంటుందన్న ఆరోపణలు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.