Begin typing your search above and press return to search.
అన్నీ బంగారమే.. చాయ్ కప్.. బాత్రూమ్.. సోఫా.. బెడ్
By: Tupaki Desk | 12 July 2020 2:10 PM GMTప్రపంచంలో బంగారానికి ఉన్న విలువ మరే వస్తువుకు లేదు. ప్రపంచ వాణిజ్యంలో బంగారమే కీలక పాత్ర పోషిస్తోంది. అంతెందుకు మన దేశం ఆపత్కాలంలో ఉంటే అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహ రావు బంగారం ద్వారానే భారతదేశం తిరిగి కోలుకునేలా చేశారు. బంగారమంటే మగువలకు ఎంతో ప్రియం. వ్యాపారులు కూడా ఇప్పుడు బంగారాన్నే పెట్టుబడిగా పెడుతున్నారు. అలాంటి బంగారం ప్రస్తుతం రికార్డు స్థాయిలో ధర పెరుగుతోంది. అయితే అలాంటి బంగారాన్ని ఓ హోటల్‌లో విరివిగా వాడుతున్నారు. ఆ బంగారంతో కప్పులు.. బెడ్లు.. సోఫాలు.. చివరకు బాత్రూమ్ కూడా బంగారంతో చేశారు. అదేమిటి.. ఎక్కడ అని అనుకుంటున్నారా.. చదవండి.
వియత్నాం దేశంలో ఓ హోటల్ నిర్మిస్తున్నారు. ఆ హోటల్ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. కానీ అప్పుడే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఏమిటా ప్రత్యేకత అంటే ఆ హోటలంతా బంగారమే. ఏది చూసినా బంగారంతో ఉంటది. హనోయ్ నగరంలోని డోల్స్ గోల్డెన్ హోటల్ నిర్మిస్తున్నారు. హోటల్ భవనం మొదలుకుని అన్ని బంగారం తాపడంతో చేసినవే. చాయ్ కప్పు.. బాత్ టబ్.. నీళ్లు పోసే మగ్గు.. సోఫాలు.. లిఫ్ట్.. తదితర అన్ని బంగారంతో తళతళ మెరుస్తున్నాయి. ఆ హోటల్‌లోని అన్ని వస్తువులు బంగారంతో తాపడం చేశారు. ప్రస్తుతం ఆ హోటల్ నిర్మాణమవుతోంది. త్వరలోనే అందుబాటులోకి రానుంది. మీరెప్పుడైనా ఆ దేశానికి వెళ్తే ఈ హోటల్‌ను ఒకసారి సందర్శించి రండి..