Begin typing your search above and press return to search.
ఈవీఎం అంటే 'ఎవ్రీ ఓట్ ఫర్ మోడీ'
By: Tupaki Desk | 30 April 2017 9:37 AM GMTఈవీఎం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కదా? అంటారా! అవును అదే సమాధానం. కానీ బీజేపీ నేతలు ఈ పేరు మార్చేశారు. 'ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్ ఫర్ మోడీ' అని తేల్చేశారు. ఉత్తరప్రదేశ్ కు సీఎంగా బాధ్యతలు చేెప్పట్టిన రోజు నుంచి కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ లో బీజేపీ నేతలు కార్యకర్తలతో సమావేశమైన యోగి మాట్లాడుతూ పై విధంగా కొత్త సూత్రీకరణ చేశారు.
కొద్దికాలం కిందట జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయగా, తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. అయితే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ మోజార్టీతో విజయం సాధించడంపై యోగి ఈ విధంగా స్పందించారు. ఢిల్లీ ప్రజలు తమ పార్టీపై నమ్మకం ఉంచారని, అందుకే 'ఈవీఎం.. ఎవ్రీ ఓట్ మోడీ' విధానాన్ని అనుసరించారని యోగీ విశ్లేషించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ దేశంలో వీఐపీల సంప్రదాయానికి అడ్డుకట్ట వేశారని కొనియాడారు. దేశంలో సంస్కరణల పర్వం మోడీ హయాంలో వేగంగా సాగుతోందని విశ్లేషించారు.
కాగా, ఈ సందర్భంగా యోగీ తన పరిపాలనపై మరోమారు క్లారిటీ ఇచ్చారు. చట్టాలపై గౌరవం లేనివాళ్లు-రౌడీలు- గూండాలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవాలని.. అది వారి మంచికోసమే తాను చెబుతున్నట్లు సీఎం యోగి పునరుద్ఘాటించారు. యూపీ చట్టాల్లో, ప్రభుత్వ విధానాలల్లో ఎన్నో మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీసు వేళ్లల్లో ముఖ్యమంత్రి ఏ సమయంలో ఫోన్ చేసినా అధికారులు కచ్చితంగా స్పందించాలని లేని పక్షంలో వేటు వేస్తానని ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. శాంతిభధ్రతలు, ప్రభుత్వ విధానాలపై తనకు స్పష్టమైన విజన్ ఉందని, భవిష్యతులోనూ ఎన్నో మార్పులకు శ్రీకారం చుడతానని గోరఖ్‌పూర్ సభలో యోగి స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/