Begin typing your search above and press return to search.
నీట్ పీజీ కౌన్సిలింగ్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం..
By: Tupaki Desk | 7 Jan 2022 12:30 PM GMTనేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) రాసే విద్యార్థులకు సుప్రీం కోర్టు తీపి కబురు అందించింది. నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లపై రిజర్వేషన్ల కోటాలను ఖరారు చేసింది. ఇందులో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం మేర సీట్లను రిజర్వు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. కాగా నీట్ పీజీ అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి అర్హతను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్దారించింది.
రూ.8లక్షలు లేదా అంతకంటే తక్కువ వార్షికాదాయం ఉన్న కుటుంబాలను ఆర్థికంగా వెనుకబడిన వారిగా గుర్తించి, వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఓ అఫిడవిట్ ను కేంద్రం సుప్రీం కోర్టుకు అందించింది. ఈ నేపథ్యంలో పిటిషన్ ను వేగవంతం చేయాలని, అత్యవసరంగా వాదనలను చేపట్టాలని తెలిపింది. ఈ పిటిషన్ ను విచారణ చేస్తున్న సీనియర్ న్యాయవాది జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని థర్మసనానికి తెలిపారు. అయితే ఢిల్లీలోని రెసిడెంట్ డాక్టర్లు చేసిన ఆందోళనకు కేంద్రం దిగివచ్చింది. ఆ తరువాత ఈడబ్ల్యూఎస్ కోటా 8 లక్షల రూపాయ వార్షికాదాయంగా నిర్దారించింది. అయితే ఈ ఆందోళనను విరమింపజేయడానికి విచారణ చేయాలని కోరింది.
ఈ డబ్ల్యూఎస్ కోటాలో డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. 14 రోజులుగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా ప్రాతిపదికన ఖరారు చేసింది. ఓబీసీ కేటగిరి తరుపున తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే సహా ఇతర సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. డీఎంకే తరుపున న్యాయవాది విల్సన్, ఇతర సంఘాల తరుపున శ్యామ్ దివాన్ వాదించారు. వీరి వాదనను విన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షాలాది మంది అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రెండురోజుల్లోనే ఈ విచారణను పూర్తి చేశామన్నారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నీట్ పీజీ అడ్మిషన్లలో ఓబీసీ వారికి 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. అండర్ గ్రాడ్యూయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యూయేట్ అడ్మిషన్లకు ఈ రిజర్వేషన్ కోటా వర్తింపజేస్తారు. ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. దీంతో ఈడబ్ల్యూఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.