Begin typing your search above and press return to search.

అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు .. ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కార్ !

By:  Tupaki Desk   |   8 Feb 2021 11:30 AM GMT
అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు .. ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కార్ !
X
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ మధ్య నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులను తాజాగా జారీ చేసింది. EWS రిజర్వేషన్లుగా పిలిచే ఈ రిజర్వేషన్లు 10 శాతం ఉంటాయి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఈ EWS రిజర్వేషన్లు అమలవుతాయి.

విద్యాసంస్థల్లో ప్రవేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప చేస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలోనే విడుదలయ్యే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకూ ఈడబ్ల్యూఎస్ వర్తింప చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలో బలహీన వర్గాలకు ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజాగా ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాటికి అదనం కానున్నాయి .

తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ జీవో 33ను రిలీజ్ చేసింది. 2019లో జరిపిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉన్నత విద్యాసంస్థలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రాష్ట్ర ప్రభుత్వ ల్లో వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే, ఉద్యోగాల్లో చేరేటప్పుడు కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయాలి. దీనికి సంబంధించి కొత్తగా రూల్స్, గైడ్ లైన్స్ తయారు చేయాలని సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖలకు ఆదేశాలు ఇచ్చింది.