Begin typing your search above and press return to search.
సీఎంపై పంచ్...ఎలుకలతో ట్విస్ట్ ఇచ్చిన మాజీ సీఎం
By: Tupaki Desk | 7 March 2020 2:30 AM GMTరాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయనేది అందరికీ తెలిసిన సంగతే. ఎదుటి వారిని టార్గెట్ చేసేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని నాయకులు వాడుకుంటారని కూడా తెలుసు. కానీ...అందులో మరీ శృతిమించిన అంశాలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. అలా తాజాగా మహిళా నాయకురాలైన ఓ మాజీ సీఎం తాజా సీఎం విషయంలో వ్యవహరించిన తీరు వైరల్ అయింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష ఆర్జేడీ నాయకురాలు, మాజీ సీఎం రబ్రీదేవి ఎలుకతో నిరసన తెలిపారు.
వివరాల్లోకి వెళితే...బీహార్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష ఆర్జేడీ డిసైడయింది. ఈ నేపథ్యంలో ఎలుకలను పట్టుకుని వచ్చి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఇంతకీ ఎలుకలకు నిరసనకు లింకేంటి అనుకుంటున్నారా? అక్కడే అసలు ట్విస్ట్. వివిధ అంశాలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే....కీలక పత్రాలు ఎలుకలు ధ్వంసం చేశాయనే సమాధానం వస్తోందట. దీంతో పత్రాలు మాయం చేయడమే కాకుండా..ఎలుకలను సాకుగా చూపుతున్నారని చెప్పడంపై ఆగ్రహించిన లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి తన పార్టీ శాసనసభ్యులతో ఎలుకను వెంటపెట్టుకుని సభకు వచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మరిన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. బీహార్‌లో పెద్ద ఎత్తున మెడిసిన్, లిక్కర్ మాఫియా జరుగుతోందని వాటికి కూడా ఎలుకలనే సాకుగా చూపిస్తూ అవినీతికి చేస్తున్నారని ఆరోపించారు.