Begin typing your search above and press return to search.

మ‌రో కాంగ్రెస్ నేత‌పై 'కేసు' తిర‌కాసు!

By:  Tupaki Desk   |   2 Oct 2018 12:54 PM GMT
మ‌రో కాంగ్రెస్ నేత‌పై కేసు తిర‌కాసు!
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల న‌గారా దాదాపుగా మోగిన నేప‌థ్యంలో అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ను మ‌రోసారి గ‌ద్దెనెక్కకుండా నిలువ‌రించేందుకు కాంగ్రెస్ తో మిగ‌తా పార్టీలు క‌లిసి మ‌హా కూట‌మిలా ఏర్ప‌డాల‌ని యోచిస్తున్నాయి. ఇక‌, మ‌రోసారి అధికారం చేప‌ట్టేందుకు టీఆర్ ఎస్ త‌న సాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌నకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. ఇప్ప‌టికే జ‌గ్గారెడ్డి - రేవంత్ రెడ్డిల‌పై కేసుల వెనుక టీఆర్ ఎస్ హ‌స్త‌ముంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై కూడా అట‌కెక్కిన ఓ కేసును తిర‌గ‌దోడేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీ‌ధ‌ర్ పై న‌మోదైన ఓ పాత కేసు ఫైల్ పై తెలంగాణ పోలీసులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించ‌డంపై కాంగ్రెస్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది.

మంథని టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ 900 కోట్లు ఆస్తులు కూడబెట్టారని ఆయ‌న‌పై ఫిర్యాదు న‌మోదైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో, రేవంత్ రేంజ్ లో ఐటీ దాడుల‌ను కాంగ్రెస్ నేత‌లు ఊహించుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే....ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ధు ప్రత్యర్థి .... దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సంబంధించిన ఓ పాత కేసు తుట్టెను పోలీసులు క‌దిల్చారట‌. కిషన్‌ రెడ్డి అనే టీఆర్ ఎస్ నేతను గంజాయి కేసులో ఇరికించేందుకు శ్రీ‌ధ‌ర్ ప‌రోక్షంగా సాయం చేశార‌ని ఆయ‌న కేసు పెట్టారు. సుదర్శన్‌ అనే కాంగ్రెస్‌ కార్యకర్తకు శ్రీధర్‌ సాయం చేశార‌ని, వారిద్ద‌రి ఫోన్‌ సంభాషణ ఆధారంగా తాను గుర్తించాన‌ని కిష‌న్ ఆరోపించారు. ఆ ఆడియో రికార్డు ప్ర‌కారం చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో శ్రీ‌ధ‌ర్ పై గతంలో కేసు న‌మోదు చేశారు. ఆ ఆడియో శ్రీధర్‌ బాబుదా కాదా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ముంద‌స్తు నేప‌థ్యంలో రిపోర్టు కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ను పోలీసులు ఆశ్ర‌యించారు. ఇక త‌ర్వాత జ‌ర‌గ‌బోయే పరిణామాల‌న్నీ శ్రీ‌ధ‌ర్ బాబుకు వ్య‌తిరేకంగా...మ‌ధ‌కు అనుకూలంగా ఉంటాయ‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు డిసైడ్ అయ్యారట‌.