Begin typing your search above and press return to search.
వైరల్ ట్వీట్..జగన్ పై ఐవైఆర్ పంచ్ పడింది
By: Tupaki Desk | 15 March 2020 4:53 PM GMTవైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగానే ఇప్పుడు టైం బాగోలేదనే చెప్పాలి. ఎందుకంటే... నిన్న మొన్నటి వరకు జగన్ కు గట్టిగానే మద్దతు పలకడంతో పాటుగా... జగన్ మంచి పాలన అందిస్తారని ఆసక్తికర ప్రకటనలు చేసిన వారు కూడా ఇప్పుడు జగన్ పై ఓ రేంజిలో ఫైరైపోతున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే... నిమ్మగడ్డపై జగన్ ఓ రేంజిలో ఫైరైపోయారు. నిన్నటిదాకా రమేశ్ కుమార్ ఎవరన్న విషయాన్ని అంతగా పట్టించుకోని జగన్... ఎన్నికల వాయిదా అన్నంతనే రమేశ్ కుమార్ కు కులాన్ని ఆపాదిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు... జగన్ పై తనదైన శైలిలో పంచ్ లు వేశారు.
మొన్నటి ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచిన తర్వాత, ఎన్నికలకు ముందు వైసీపీకి, ప్రత్యేకించి జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా... జగన్ కు ఓ రేంజిలో మద్దతు తెలిపిన వారిలో ఐవైఆర్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు నిమ్మగడ్డపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసినంతనే... ఎంట్రీ ఇచ్చిన ఐవైఆర్... జగన్ ను ఓ రేంజిలో కడిగిపారేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని, అలాంటి ఎన్నికల సంఘానికి కమిషనర్ గా ఉన్న అదికారిపై అనుచిత వ్యాఖ్యలు తగవని ఐవైఆర్ సూచించారు. అంతేకాకుండా తనకు 151 సీట్లు వచ్చాయని చెబుతున్న జగన్... మొత్తం 175 సీట్లు వచ్చినా కూడా తనకు కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా ఐవైఆర్ తనదైన శైలి పంచ్ లు పేల్చారు.
జగన్ వ్యవహార సరళిపై ఐవైఆర్ ఇంకా ఏమన్నారంటే... 151 సీట్లు వచ్చినా - లేదంటే మొత్తం 175 స్థానాలు గెలిచినా కూడా రాజ్యాంగ బద్దంగా నడిచే సంస్థప ఆరోపణలు చేయడం సరికాదు. ముఖ్యమంత్రికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ విషయాన్ని జగన్ గమనిస్తే మంచిది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగినంత కాలం ఇండ్ల స్థలాల పంపిణీని నిలిపివేసే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. సరైన కారణాలతో ఎన్నికలను వాయిదా వేసే అధికారి కూడా ఈసీకి ఉంది. రాజ్యాంగ బద్ధ సంస్థలపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించి కామెంట్ చేయాలి’’ అంటూ జగన్ పై ఐవైఆర్ తనదైన రేంజిలో సెటైర్ల వర్షం కురిపించారు. ఇదంతా చూస్తుంటే... జగన్ కు ఇప్పుడు నిజంగానే బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పక తప్పదు.