Begin typing your search above and press return to search.
నయిం.. దినేశ్ రెడ్డి.. ఒక ప్రెస్ మీట్
By: Tupaki Desk | 13 Aug 2016 7:41 AM GMTగ్యాంగ్ స్టర్ నయిం వ్యవహారం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఎన్ కౌంటర్ అయి రోజులు గడుస్తున్నా ఒకటి తర్వాత ఒకటిగా తెర మీదకు వస్తున్న అంశాలు.. వాటికి సంబంధించిన రియాక్షన్లతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నయిం వెనుక మాజీ మంత్రి ఉన్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావటం తెలిసిందే. ఇలా వార్తలు వచ్చిన తర్వాత.. తెలంగాణ టీడీపీ మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తెర మీదకు వచ్చి తన వాదనను సమర్థంగా వినిపించారు. నయిం వ్యవహారంపై సిట్ కాదు.. జ్యూడిషియల్ విచారణకు ఆదేశించాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. గాలి వార్తలుగా వినిపించిన ఉమామాధవరెడ్డి పై ఆరోపణలు.. ఆమె ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై రాజకీయ దాడి జరుగుతుందా? అన్న సందేహం కలిగించేలా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. నయిం వెనుక మరో మాజీ మంత్రి ఉన్నారంటూ ఒక కొత్త వార్త బయటకు వచ్చింది. వీటితో పాటు ఒక డీజీపి కూడా ఉన్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఫలానా అధికారి అన్న మాట ఎక్కడా రాకున్నా.. ఒక డీజీపి స్థాయి అధికారి నయింకు బ్యాక్ బోన్ గా నిలిచారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే.. మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి నయిం ఎన్ కౌంటర్ మీద తానొక ప్రెస్ మీట్ పెడుతున్నట్లుగా మీడియా సంస్థలకు సమాచారం పంపారు. అందులో పేర్కొన్న దాని ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రావాలని.. బీజేపీ కార్యాలయ చిరునామాను ఇచ్చారు.
ఇన్విటేషన్ కు తగ్గట్లే బీజేపీ కార్యాలయానికి వెళ్లిన మీడియాకూ ఊహించని షాక్ తగిలింది. ప్రెస్ మీట్ ను పార్టీ ఆఫీసులో పెట్టేందుకు బీజేపీ పెద్దలు ససేమిరా అన్నారని.. పార్టీ వేదిక మీద కాకుండా.. బయట మరేదైనా వేదిక మీద దినేశ్ రెడ్డి తన ప్రెస్ మీట్ ను పెట్టుకోవచ్చంటూ బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా చెబుతున్నారు.దీంతో ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను సాంకేతిక కారణాల పేరు చెప్పి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక డీజీపి నయిం వెనుక ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తే.. మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి ఎందుకు వివరణ ఇవ్వాలనుకున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అదే విషయాన్ని పలు టీవీ ఛానళ్లు ప్రశ్నిస్తూ..వార్తలు అందించటం గమనార్హం. ఇదే ప్రశ్నను సంధించిన బీజేపీ అధినాయకత్వం దినేశ్ రెడ్డి ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేయించినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. నయిం ఇష్యూ గురించి దినేశ్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నారో..?