Begin typing your search above and press return to search.

ప్రెస్‌ మీట్ పెట్టిన మాజీ డీజీపీ ఏం చెప్పారంటే

By:  Tupaki Desk   |   13 Aug 2016 9:05 AM GMT
ప్రెస్‌ మీట్ పెట్టిన మాజీ డీజీపీ ఏం చెప్పారంటే
X
గ్యాంగ్‌ స్ట‌ర్ న‌యిం ఎన్ కౌంట‌రేమో కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. హాట్ టాపిక్ గా మారిన ఈ ఇష్యూకు సంబంధించి చాలామంది ప్ర‌ముఖుల పాత్ర ఉందంటూ వార్త‌లురావ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ సంద‌ర్భంగా కొంద‌రు ప్రెస్ మీట్‌ పెట్ట‌టం క‌నిపిస్తోంది. న‌యిం వెనుక ఒ మాజీ డీజీపీ హ‌స్తం ఉంద‌న్న వార్త‌లు మీడియాలో చాలా త‌ర‌చుగా వ‌స్తున్న వేళ‌.. మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. తొలుత ఈ ప్రెస్ మీట్‌ ను బీజేపీ కార్యాల‌యంలో పెట్టిన ఆయ‌న‌.. అనంత‌రం సాంకేతిక కార‌ణాల‌తో వెన్యూ మార్చారు.

ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన వెంట‌నే.. వెన్యూ మార్చిన దినేశ్‌.. పార్టీ కార్యాల‌యంలో ఏసీలు ప‌ని చేయ‌క‌పోవ‌టంతో వేదిక మార్చాల్సి వ‌చ్చింద‌న్నారు. బీజేపీ కార్యాల‌యం నుంచి ల‌క్డీకాఫూల్ లోని అశోకా హోట‌ల్ లో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. త‌మ పార్టీ గురించి.. మోడీ నాయ‌క‌త్వం గురించి గొప్ప‌లు చెప్పిన దినేశ్‌.. అనంత‌రం న‌యిం ఎన్ కౌంట‌ర్ విష‌యంలో తెలంగాణ స‌ర్కారుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు సెల్యూట్ చేస్తున్నాన‌ని చెప్పిన ఆయ‌న‌.. తాను పార్టీ త‌ర‌ఫున మాట్లాడుతున్నానే త‌ప్పించి.. మ‌రొక‌టి లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

త‌న‌తో స‌హా ఏ డీజీపీకి న‌యింతో సంబంధాలు లేవంటూ స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. ఉమ్మ‌డి రాష్ట్రంలో డీజీపీగా ప‌ని చేసిన ఏ ఒక్క అధికారికి కూడా న‌యింతో సంబంధాలు లేవ‌న్నారు. న‌యిం ఎన్ కౌంట‌ర్ ఇష్యూలో మీడియా అత్యుత్సాహంతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న ఆయ‌న‌.. ఒక మీడియా ఛాన‌ల్ మ‌రింత ఎక్కువ చేస్తుందంటూ త‌ప్పు ప‌ట్టారు. ఆధారాలు ఉంటే బ‌య‌ట‌పెట్టాలే కానీ.. న‌యింతో డీజీపీకి సంబంధాలు ఉన్న‌ట్లుగా వార్త‌లు ప్ర‌సారం చేయ‌టం ఏమిటంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

= నయీమ్ ఎన్ కౌంటర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు

= ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు సెల్యూట్ చేస్తున్నా. న‌యిం విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌టం బాగుంది.

= లొంగిపోయిన మావోయిస్ట్‌ ల‌ను పోలీసులు ఇన్ఫార్మ‌ర్ గా వాడుకోవ‌టం మామూలే

= ఆ మాజీ డీజీపీ పేరు ఏమిటో బ‌య‌ట‌పెట్టాలి

= మాజీ డీజీపీ పాత్ర ఉందంటూ ప్ర‌చారం చేశారు. ప‌ది మంది డీజీపీల్లో నేనూ ఒక‌డిని

= ఒక మాజీ డీజీపీగా వివ‌ర‌ణ ఇవ్వ‌టం నా బాధ్య‌త‌

= కేసీఆర్‌ ను క‌లిసి న‌యిం వివ‌రాలు ఇస్తా. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం అడిగాం

= తెలంగాణ పోలీసుల‌కు అభినంద‌న‌లు

= న‌యింను అంత‌మొందించ‌టం మంచిదే

= విచార‌ణ నిష్ప‌క్ష పాతంగా జ‌ర‌గాలి

= సిట్‌కుఏ అధికారినైనా విచారించే అధికారం ఉంటుంది

= న‌యింతో ఏ డీజీపీకి సంబంధం లేదు

= న‌యిం అరెస్ట్ కోసం నా హ‌యాంలో ప్ర‌య‌త్నించాం.కానీ.. అనుమ‌తి రాలేదు.

= కేసులో అమాయ‌కులు ఇబ్బందులు ప‌డొద్దు. అమాయ‌కుల‌కు అన్యాయం జ‌ర‌గొద్దు.

= న‌యింను స్వ‌లాభం కోసం వాడుకున్న వారిని శిక్షించాలి

= న‌యిం వెనుక ఉన్న వారంద‌రిని బ‌య‌ట‌కు తీసుకురావాలి