Begin typing your search above and press return to search.
పాకిస్తానీ నటికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన మిశ్రా!
By: Tupaki Desk | 8 Sep 2022 12:41 PM GMTభారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ఇటీవల ట్విట్టర్‌లో సెటైరికల్ ట్వీట్లతో ఫేమస్ అయ్యారు. పాకిస్తాన్‌తో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఈ లెగ్ స్పిన్నర్ ట్విటర్‌లో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు కనుక పాకిస్తాన్‌ను ఓడించగలిగితే వారం మొత్తం ఆఫ్ఘని చాప్ తింటానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
కానీ అది జరగలేదు. తృటిలో అప్ఘనిస్తాన్ ఓడి పాకిస్తాన్ గెలిచింది. దీంతో పాకిస్థానీ నటి మరియు సామాజిక కార్యకర్త సెహర్ షిన్వారీ మన అమిత్ మిశ్రాను కవ్వించే ప్రయత్నం చేసింది. ఆమె ట్వీట్ చేస్తూ ‘ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్ ను విఫలమైనందున.. అప్ఘన్ చాప్ ను తినడానికి బదులు 'ఆవు పేడ' తినమని మిశ్రాను ఎద్దేవా చేసింది.
మిశ్రా దీనికి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. షిన్వారీ ట్వీట్‌ను ఉటంకిస్తూ ‘ తనకు పాకిస్థాన్‌కు వచ్చే ఆలోచన లేద’ని ఘాటు కౌంటర్ ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు విపరీతంగా నవ్వుకోవడంతో ట్విటర్ లో ట్రెండింగ్ గా మారింది. వారిలో కొద్దిమంది కూడా పాకిస్తాన్ నటిని ట్రోల్ చేయడానికి మిశ్రాతో చేరారు.
నటి మరోసారి దీనికి రిప్లై ఇచ్చింది. "పాకిస్తాన్‌కు ఎందుకు వస్తున్నారు? ఆవు పేడ భారతదేశంలో స్టాక్ లేదా?" అని ఆమె మిశ్రాను ప్రశ్నించింది. దీనికి మిశ్రా ఎలా సమాధానమిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే నెటిజన్లు ఇప్పటికే ఇదే విషయమై పాకిస్తాన్ నటిని ట్విట్టర్ లో ఏకిపారేస్తున్నారు.
ఆసియాకప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత్ ఇప్పుడు సెప్టెంబర్ 8న (గురువారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో తన చివరి మ్యాచ్ ఆడుతుంది. సూపర్ ఫోర్‌లో ఒక్క విజయం లేని రెండు జట్లూ రెండో రౌండ్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసుకునేందుకు ఈ మ్యాచ్ ఆడుతున్నాయి.
ఫైనల్స్‌కు అర్హత సాధించాలనే ఆశ లేకపోవడంతో టీ 20 ప్రపంచ కప్‌పై దృష్టి సారించిన టీమిండియా కొంతమంది ఆటగాళ్లను తీసివేసి బాగా ఆడేవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు తెలిసింది. . మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు చేసే అవకాశం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.