Begin typing your search above and press return to search.

ట్రంప్‌ పై ఇంటలిజెన్స్ మాజీ చీఫ్‌ ల తిరుగుబాటు

By:  Tupaki Desk   |   18 Aug 2018 12:30 PM GMT
ట్రంప్‌ పై ఇంటలిజెన్స్ మాజీ చీఫ్‌ ల తిరుగుబాటు
X
అగ్రరాజ్యం అమెరికాలో ప‌రిణామాలు వేగంగామారుతున్నాయి. ఆ దేశాధిప‌తి డొనాల్డ్ ట్రంప్ తీరుతో ఇప్ప‌టికే వివిధ దేశాల నేత‌లు భ‌గ్గుమంటుండ‌గా...తాజాగా ఆ దేశంలోని ముఖ్య నేత‌లు సైతం అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు సీఐఏ మాజీ చీఫ్ జాన్ బ్రెన్నాన్ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులపై మాజీ ఇంటలిజెన్స్ అధికారులు ధ్వజమెత్తారు.బ్రెన్నాన్‌ కు జరిగిన అవమానంపై గతంలో నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్లుగా - సీఐఏ డైరెక్టర్లుగా పనిచేసిన 12 మంది మాజీలు సంయుక్తంగా ట్రంప్‌కు అసాధారణమైన రీతిలో లేఖ రాశారు. అధ్యక్షుని చర్య వాక్ సాతంత్య్రాన్ని అణచేసేదిగా ఉందని దుయ్యబట్టారు.

సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేస్తే ప్రభుత్వ రహస్య పత్రాల పరిశీలనకు అవకాశం ఉండదు. గతంలో సీనియర్ పదవులు నిర్వహించినవారికి ఇది అవమానంగా ఉంటుంది. అలాగే వివిధ దర్యాప్తుల్లో సాక్ష్యాల కింద ప్రస్తావించాల్సిన పత్రాలు సేకరించడం అసాధ్యమైపోతుంది. త‌మ మాజీ స‌హ‌చ‌రుడికి ఇలాంటి అవ‌మానం జ‌రిగిన నేప‌థ్యంలో సీఐఏ మాజీ డైరెక్టర్లు విలియం వెబ్‌ స్టర్ - జార్జి టెనెట్ - పోర్టర్ గాస్ - మైకేల్ హేడెన్ - లియాన్ పనెట్టా - డేవిడ్ పెట్రేయస్‌ తోపాటు ఇంటలిజెన్స్ రంగంలోని ఇతర మాజీ సీనియర్లు ఈ లేఖపై సంతకం చేశారు. బ్రెన్నన్‌తో ఏకీభవించనంత మాత్రాన ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేయడం గొంతు నొక్కడమే అవుతుందని వారు అధ్యక్షునిపై విమర్శలు సంధించారు.

ఇదిలాఉండగా, ఒసామా బిన్‌ లాడెన్ వేటకు చేపట్టిన ఆపరేషన్‌ కు నాయకత్వం వహించిన వైస్ అడ్మిరల్ విలియం హెచ్ మెక్‌ రావెన్ తన సెక్యూరిటీ క్లియరెన్స్‌ ను రద్దు చేయాల్సిందిగా ట్రంప్‌ ను సవాల్ చేశారు. ఇలా ఒక‌రి వెంట ఒక‌రు కీల‌క అధికారులు త‌మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది నవంబర్‌లో వాషింగ్టన్ నగర వీధుల్లో లక్షల మంది ఆర్మీ సైనికులతో నిర్వహించ తలపెట్టిన కవాతును వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు ఆ దేశ రక్షణశాఖ వెల్లడించడం వెనుక ఈ ప‌రిణామాలు కార‌ణం అయి ఉంటాయా? అనే చ‌ర్చ మొద‌లైంది.