Begin typing your search above and press return to search.
మూడేళ్లలో ఎన్నికలట..అయ్యన్నకు మోదీ చెప్పారేమో?
By: Tupaki Desk | 4 Sep 2019 11:03 AM GMTటీడీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి చిర్రెత్తుకొస్తే ఎలా ఉంటుందో... విశాఖ జిల్లా వాసులతో పాటు తెలుగు నేల ప్రజలక కూడా ఇప్పుడు బాగానే తెలిసి వచ్చేసింది. 35 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటూ... ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మాదిరిగా తన సొంత డబ్బా కొట్టేసుకన్న అయ్యన్న... రోడ్ సేఫ్టీ నిబంధనలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అంతేనా... టీడీపీ మినహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా తనదైన శైలి అసహనంతో రెచ్చిపోయే అయ్యన్న... ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు పైనా శాపనార్థాలు పెట్టారు. మరో మూడేళ్లలోనే ఎన్నికలు జరగనున్నాయంటూ తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన అయ్యన్న... ఆ ఎన్నికల్లో టీడీపీనే విజయం సాధిస్తుందని కూడా జోస్యం చెప్పారు. ఇన్నేసి మాటలను అయ్యన్న నోట నుంచి ఒకేసారి వినడంతో విశాఖ జిల్లా నర్సీపట్నం తెలుగు తమ్ముళ్లు పూనకం వచ్చినట్టుగా కేరింతలు కొట్టారు.
అయ్యన్న నోట ఇన్నేసి సంచలన ప్రకటనలు వెలువడిన సందర్భంలోకి వెళితే... నేడు అయ్యన్న పుట్టిన రోజట. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన సొంత నియోజకవర్గం, అయ్యన్నను ఓడించిన నియోజకవర్గం నర్సీపట్నంలో తెలుగు తమ్ముళ్లు భారీ ర్యాలీని నిర్వహించదలచారట. ఈ ర్యాలీలో స్వయంగా అయ్యన్న కూడా పాలుపంచుకోగా... ర్యాలీలో పెద్ద ఎత్తున బైకులపై వచ్చిన తమ్ముళ్లు హెల్మాట్లె పెట్టుకోకుండానే రయ్యిమని దూసుకువచ్చారు. దీంతో ఎంట్రీ ఇచ్చిన ఖాకీలు... హెల్మెట్లు లేకుండా బైక్ ర్యాలీ ఏంటంటూ ర్యాలీని అడ్డుకున్నారు. అసలు బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరించినా ర్యాలీ ఎలా నిర్వహిస్తారంటూ కూడా అయ్యన్నకు షాకిచ్చారు. దీంతో షాక్ తిన్న అయ్యన్న... అక్కడే నడిరోడ్డుపై తాను నిలిచిన వాహనంపైనే నిలిచి మైందుకున్నారు.
ర్యాలీని అడ్డుకున్నారన్న అక్కసుతో పోలీసులపై చిందులేసిన అయ్యన్న... తన ర్యాలీని అడ్డుకోండని స్వయంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే పోలీసులకు ఆదేశాలు జారీ చేసి ఉవంటారని కూడా అయ్యన్న తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. అయినా హెల్మెట్లు లేకుండా బైకులు నడిపితే తప్పా? అని ప్రశ్నించిన అయ్యన్న,... ఈ నిబంధన ఒక్క నర్సీపట్నంలోనే అమలవుతోందా?, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా అమలవుతోందా? అని తనదైన శైలి ప్రశ్నలు సంధించారు. అంతటితోొ ఆగని అయ్యన్న... మరో మూడు ఏళ్ళల్లో ఎన్నికలు రానున్నాయని - ఆ ఎన్నికల్లో తామే అధికారంలోకి రానున్నామని - ఇప్పుడు తనను ఆపిన పోలీసులు అప్పుడు తమ కిందే పనిచేయాల్సి ఉంటుందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగి అప్పుడే ఆరు నెలలు కూడా కాలేదు. మరి మూడేళ్లలోనే ఎన్నికలు ఉంటాయని అయ్యన్న చెబుతున్నారంటే... జమిలి దిశగా సాగుతున్న ప్రధాని మోదీ ఏమైనా అయ్యన్న చెవిలో ఆ విషయాన్ని ఊదారా? అన్న కోణంలో ఆసక్తికర సెటైర్లు వినిపిస్తున్నాయి.