Begin typing your search above and press return to search.
కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.?
By: Tupaki Desk | 3 March 2020 6:15 AM GMTశ్రీధర్ బాబు.. కాంగ్రెస్ లో సీనియర్ నేత. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే. కరీంనగర్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గాలిని తట్టుకొని గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబే. సీనియర్ అయిన ఈయనను తెలంగాణ పీసీసీ రేసు లో కూడా చేర్చారు. ఈయనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తారనే చర్చ జరిగినా అది కార్యరూపం దాల్చడం లేదు.
తాజాగా శ్రీధర్ బాబుపై మరో ప్రచారం మొదలైంది. మార్చి 7న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి. శ్రీధర్ బాబును కారెక్కించడంలో మంత్రి ఈటల రాజేందర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ లో ఉద్దండ వాదులుగా గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్ బాబులు ఉండేవారు. కానీ గండ్ర ఇప్పటికే కాంగ్రెస్ కాడి వదిలేసి టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు అదే బాటలో బలం లేని కాంగ్రెస్ లో కంటే గులాబీ పార్టీ లో చేరితేనే బెటర్ అని ఆలోచిస్తున్నారట..
తనకు పీసీసీ పదవి రాకుండా కాంగ్రెస్ లో కుట్ర చేశారని మనస్థాపంగా ఉన్న శ్రీధర్ బాబు టీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
అయితే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానేనే వార్తలపై శ్రీధర్ బాబు మౌనంగా ఉన్నారు. కార్యకర్తలు సంప్రదిస్తున్నా అలాంటిదేమీ లేదంటున్నారు. చూడాలి మరీ శ్రీధర్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..