Begin typing your search above and press return to search.

గాలి స్కాం.. న్యాయమూర్తికి 40 కోట్ల లంచం

By:  Tupaki Desk   |   26 Aug 2019 11:04 AM GMT
గాలి స్కాం.. న్యాయమూర్తికి 40 కోట్ల లంచం
X
గాలి జనార్ధన్ రెడ్డి.. మైనింగ్ కింగ్. కర్ణాటకలోని బళ్లారిని కేంద్రంగా చేసుకొని ఓబుళాపురం మైనింగ్ చేసిన బడా పారిశ్రామికవేత్త.. మాజీ మంత్రి కూడా. అలాంటి గాలిపై కాంగ్రెస్ హయాంలో కేసులు నమోదయ్యాయి. మైనింగ్ లో దోచుకున్నాడని జైలుకు పంపారు. హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది.

అయితే ఈ కేసు విచారణ సమయంలో 2012లో గాలి జనర్ధాన్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వడానికి ఏకంగా ఏసీబీ జడ్జి నాగమారుతి శర్మకు రూ.40 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని.. మరో న్యాయమూర్తికి 15 కోట్లు ఆశచూపారని కేసు నమోదైంది. అయితే గాలి 40 కోట్ల బెయిల్ ఆఫర్ ను నాగమారుతి శర్మ నిరాకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. తాజాగా ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి జడ్జి నాగమారుతి శర్మ హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

గాలి తనకు మొత్తం 100 కోట్ల ఆఫర్ చేసి మొదటి విడతగా 40 కోట్లు లంచం ఇస్తానన్నారని జడ్జి నాగమారుతి శర్మ వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని రికార్డు చేసిన ఏసీబీ జడ్జి తాజాగా విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు.

ఇదే కేసులో మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి, గాలి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబుకు నోటీసులు జారీ చేయడంతో వారు కూడా విచారణకు హాజరయ్యారు. బెయిల్ కోసమే గాలి 100 కోట్ల లంచం ఆఫర్ చేశారంటే ఆయన సంపాదన ఎన్ని వేల కోట్లు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.