Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి జవహర్ హాట్ కామెంట్స్ : తల్లికి కారు కొనడానికి డబ్బులు లేవా జగన్...?

By:  Tupaki Desk   |   27 Jun 2022 2:30 PM GMT
మాజీ మంత్రి జవహర్ హాట్ కామెంట్స్ : తల్లికి కారు కొనడానికి డబ్బులు లేవా జగన్...?
X
జగన్ అంటే ఏపీ సీఎం. ఆయన దానికి ముందు పారిశ్రామికవేత్త. ఆయనకు డబ్బులకు కొదవ లేదు అనే అనుకుంటారు. అలాంటి జగన్ తన తల్లి కారు కొనుక్కుటే డబ్బులు ఇవ్వలేకపోయారా. విజయమ్మ కారు కొంటే దానికి కూతురు షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ డబ్బులు ఇచ్చారని ప్రచారం అవుతోంది. ఈ విషయాన్ని టీడీపీ మాజీ మంత్రి కే ఎస్ జవహర్ చెబుతూ హాట్ కామెంట్స్ చేశారు. తల్లికి కారు కొనడానికి కూడా జగన్ కి డబ్బులు లేవా అని ఆయన ప్రశ్నించారు.

అంతపురం విషయాలు అలా తన దాకా వచ్చాయని, ఇందులో తప్పేమైనా ఉంటే తాను తన మాటలను విత్ డ్రా చేసుకుంటాను అని ఆయన అన్నారు. అదే తప్పు అని రుజువు చేస్తే జగన్ బాంక్ అకౌంట్ నుంచి తల్లి కారు కొనడానికి డబ్బులు ఇచ్చారేమో చెప్పాలని కోరారు. జగన్ కి డబ్బులు అంటే ఉన్న ప్రేమ ఎవరి మీద లేదని ఆయన అనడం విశేషం.

ఎన్టీయార్ శతజయంతి కార్యక్రమాలలో భాగంగా జవహర్ సింగపూర్ తెలుగు ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్ర్మాలలో ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఫోరం ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ముచ్చటించారు. తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్నపుడు ఏపీలో విచ్చలవిడిగా మద్య ప్రవాహం జరగ‌లేదని అన్నారు. ఒక చక్కని పాలసీతో ఎక్సైజ్ శాఖ నడించిందని అన్నారు.

ఆనాడు నవోదయం పేరిట మద్యపానం అలవాటు నుంచి జనాలను దూరం చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అలాగే డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టి మరీ యువతను మద్యానికి బానిసలు కాకుండా కాపాడామని చెప్పారు. అదే జగన్ సర్కార్ వచ్చాక మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా చేసుకోవడం దారుణం అన్నారు.

అనేక రకాల చెత్త బ్రాండ్లను మార్కెట్ లోకి వదిలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఏడు రూపాయ‌లు ఉన్న చీప్ లిక్కర్ ని 250 రూపాయలకు అమ్ముతున్నారని. బూం బూం, ష‌కలక, ప్రెసిడెంట్ గోల్డ్ అంటూ అనేక రకాల బ్రాండ్లను మార్కెట్ లోకి తెచ్చారని జవహర్ ఆరోపించారు. తాము అలాంటి వాటికి అనుమతించలేదని, తాము తెచ్చిన బ్రాండ్లే అంటే వాటిని వైసీపీ పెద్దలు ఎందుకు కొనసాగిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.

మద్యం ద్వారా గంటకు పది కోట్లు, రోజుకు 240 కోట్లు, ఏడాదికి 84 వేల కోట్లకు పైగా సంపాదనను వైసీపీ ప్రభుత్వం చేస్తూ అతి పెద్ద ఆదాయ వనరుగా చేసిందని ఆయన ఆరోపించారు. అలాగే సారాయి, గంజాయ్, డ్రగ్స్ వంటి వాటి ద్వారా ఏపీని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారని అన్నారు.

కోనసీమ జిల్లాలో అల్లర్ల వెనక వైసీపీ నేతలే ఉన్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన సుబ్రమణ్యంని హత్య చేసిన దాన్ని ఏమార్చడానికే ఈ అల్లర్లు చేశారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ మీద నిజంగా ప్రేమ ఉంటే జిల్లాకు పేరుతో పాటు తమ ప్రభుత్వం ఆనాడు అమరావతి రాజధానిలో ప్రతిపాదించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఆపారని ఆయన నిలదీశారు.

ఇక ఏపీలో కుల రాజకీయాలను వైసీపీ చేస్తోందని ఆయన అన్నారు. కమ్మల మీద అకారణ ద్వేషం మంచిది కాదని, అలాగే అన్ని కులాలూ సమానమేనని జవహర్ పేర్కొన్నారు. జగన్ హిందూ సంప్రదాయాలను అనుసరించడంలేదు, అలాగే పూర్తి స్థాయి క్రిస్టియన్ గా కూడా ఉండడం లేదని మరో ఘాటైన కామెంట్ చేశారు. క్రిస్టియన్ కి ఒకరే దేవుడని, జగన్ మాత్రం తన రాజకీయం కోసం స్వరూపానందేంద్ర స్వామీజీ కాళ్ళు పట్టుకున్నారని జవహర్ ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ కంటే సామాజిక న్యాయం చేసే పార్టీ వేరేదీ లేదని ఆయన అంటూ టీడీపీ ద్వారా ఎందరో రాజకీయంగా ఎదిగారని గుర్తు చేశారు. చంద్రబాబు తరువాత పరిపూర్ణ నాయకుడిగా ఎదిగే సత్తా లోకేష్ కి ఉందని జవహర్ కితాబు ఇచ్చారు. బాలయ్య హిందూపురాన్ని అభివృద్ధి చేసి రోల్ మోడల్ గా నిలిచారని అన్నారు. బాలయ్యలో మంచి మానవతావాది ఉన్నారని ఆయన అనడం విశేషం.