Begin typing your search above and press return to search.

పెనుకొండ క‌ల‌క‌లం.. మాజీ మంత్రికి ఎస‌రు?

By:  Tupaki Desk   |   19 Dec 2022 2:30 AM GMT
పెనుకొండ క‌ల‌క‌లం.. మాజీ మంత్రికి ఎస‌రు?
X
ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని అత్యంత ముఖ్య‌మైన నియోజ‌క‌వ‌ర్గం పెనుకొండ‌. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న మాల‌గుండ్ల శంక‌ర నారాయ‌ణ‌కు ఇప్పుడు ఫుల్లుగా వ్య‌తిర‌క‌త క‌నిపిస్తోంది. అస‌లు ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డానికి కూడా వీల్లేద‌న్న రీతిలో తాజాగా హంగామా సృష్టించారు కార్య‌క‌ర్త‌లు. అయితే.. ఇక్క‌డ అస‌లు రీజ‌న్ ఏంటంటే.. మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ త‌మ‌కు అస‌లు అందుబాటులోనే ఉండ‌డం లేద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.

ఈ ప‌రిణామాల‌కు తోడు తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు సైతం ఆయ‌న కుటుంబాన్ని వెంటాడుతున్నారు. త‌న కోసం ప‌నిచేసిన వారిని ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డం.. క‌నీసం డెవ‌ల‌ప్‌మెంట్ యాక్టివిటీ కూడా లేకుండా.. పోవ‌డం వంటివి ఇక్క‌డ క‌నిపిస్తున్నాయి. వాస్త‌వానికి శంక‌ర నారాయ‌ణ తొలి కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. అప్ప‌ట్లోనే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఇక్క‌డ కొంద‌రు చ‌క్రం తిప్పారు.

ఆయ‌న‌ను నియోజ‌క‌వ‌ర్గంలోకి కూడా రానివ్వ‌బోమంటూ.. కొంద‌రు నేత‌లు తెగేసి చెప్పారు. అప్ప‌ట్లోనే ఆయ‌న అలెర్ట్ అయి ఉంటే ఇప్పుడు ఈ స‌మ‌స్య వ‌చ్చేది కాదు. కానీ ఆయ‌న అప్ప‌ట్లో లైట్ తీసుకున్నారు. ప్ర‌తి విష‌యాన్ని.. కూడా త‌న‌కు సంబంధం లేద‌ని.. ఎగ‌స్పార్టీవాళ్లు ప్రోత్స‌హిస్తున్నార‌ని చెబుతూ వ‌చ్చారు. ఫ‌లితంగా ఇప్పుడు మ‌రింత తీవ్ర‌మైన వ్య‌తిరేకత పెరిగిపోయింది.

ఇది ఇప్పుడు స‌రిచేసుకునే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింద‌నేది తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి ఇట్టే అర్ధ‌మ‌వుతోంది. క‌నీసం ఇప్ప‌టికైనా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి పై దృష్టి పెడితే త‌ప్ప‌.. అస‌లు గెలిచే ప‌రిస్థితి లేద‌ని శంక‌ర‌నారాయ‌ణ ఉదంతం క‌ళ్ల‌కు క‌డుతోంది. ఇక‌, తాజాగా కార్య‌క‌ర్త‌లు చెప్పులు చూపించిన ఘ‌ట‌నపై అధిష్టానం కూడా సీరియ‌స్‌గానే ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి చివ‌ర‌కు టికెట్ ద‌క్కుతుంందో లేదో చూడాలి.