Begin typing your search above and press return to search.
ఏపీలో ఇలానే ఉంటుందా? ఉద్యోగి తప్పు చేస్తే అధినేతను లోపలేస్తారా?
By: Tupaki Desk | 10 May 2022 9:42 AM GMTమీకో పెద్ద కంపెనీ ఉంది. అందులో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఒకరిద్దరు ఉద్యోగులు కక్కుర్తి పడ్డారు. అక్రమార్కులతో చేతులు కలిపారు. తప్పు చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఎలా రియాక్టు కావాలి? అన్నప్పుడు సదరు ఉద్యోగి మీద చర్యలు తీసుకోవాల్సిందే. అందులో వేరే మాట లేదు. తప్పు చేసిన ఉద్యోగిని అదుపులోకి తీసుకొని.. విచారించి.. అందులో సదరు సంస్థ యజమాని కారణంగానే ఆ నేరం జరిగిందని.. అందులో అతని హస్తం పక్కాగా ఉందన్న ఆధారాలు.. సాక్ష్యాలు లభిస్తే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సదరు యజమానిని అరెస్టు చేయొచ్చు.
అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం తాజాగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం విస్మయానికి గురి చేస్తోంది. నారాయణ సంస్థలకు చెందిన ఒక ఉద్యోగి టెన్త్ పేపర్ లీకేజీలో కీలక సూత్రధారిగా మారి.. అతని కారణంగానే పేపర్ లీక్ అయినట్లుగా ఆధారాలు లబించినప్పుడు అతన్ని అరెస్టు చేయటం తప్పేం కాదు. అయితే.. ఏపీలో జరిగింది మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. చిత్తూరు ఇన్ స్పెక్టర్ కు జిల్లా విద్యాధికారి టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందన్న విషయాన్ని కంప్లైంట్ చేయగా.. ఐపీసీ 408.. పబ్లిక్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయటం వరకు బాగానే ఉంది.
కానీ.. నారాయణ సంస్థల ఉద్యోగి ఒకరు ఎగ్జామ్ పేపర్ లీక్ లో కీలకభూమిక పోషిస్తే.. అందుకు ప్రతిగా ఆ సంస్థ యజమాని నారాయణను హైదరాబాద్ కు వెళ్లి మరీ ఆయన్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేయటం ఎంతవరకుసబబు? అన్నది ప్రశ్న. ఒక పెద్ద వ్యాపారాన్నినిర్వహిస్తున్నప్పుడు వేలాది మంది ఉద్యోగులు ఉంటారు. నారాయణ విద్యా సంస్థనే తీసుకున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వరకే కొన్ని వేల మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. అలాంటప్పుడు ఒక ఉద్యోగి చేసిన తప్పును యజమాని నారాయణను ఎలా బాధ్యుల్ని చేస్తారన్నది ప్రశ్న.
ఇదే న్యాయాన్ని అమలు చేస్తే.. ప్రభుత్వంలోని కీలక ఉద్యోగి ఒకరు నేరం చేస్తే.. అతనితో పాటు.. ఆ శాఖకు చెందిన మంత్రి ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని చెప్పి మంత్రిని బాధ్యుల్ని చేస్తే ఎలా ఉంటుంది? ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది. ఈ తీరు ఏ మాత్రం సరికాదంటున్నారు. ఒక ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన అధినేతను అరెస్టు చేసే విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.