Begin typing your search above and press return to search.

టార్గెట్ ఆయనే : నారాయణ... నారాయణ... ?

By:  Tupaki Desk   |   10 May 2022 3:31 PM GMT
టార్గెట్ ఆయనే : నారాయణ... నారాయణ... ?
X
కొందరి విషయంలో చూస్తే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో అనిపిస్తుంది. నారాయణ విద్యా సంస్థలకు అధినేత. ఆయనకు మంత్రి కాక ముందు కూడా ఏపీలో పేరు బాగా ఉంది. ఆయన స్థితిమంతుడు, అంగబలం కూడా మెండుగా ఉన్నవాడు, దాంతో తటస్థుల కోటాలో ఆయన్ని రాజకీయాల్లోకి 2014లో టీడీపీ అధినాయకుడు చంద్రబాబు తెచ్చారు.

ఆ మీదట ఆయనను కీలకమైన శాఖకు తొలి పర్యాయమే మంత్రిని చేశారు. చంద్రబాబు భుజానికెత్తుకున్న అమరావతి రాజధానికి మొత్తం నారాయణే అన్నట్లుగా కధ సాగించారు. మొత్తానికి చూస్తే అయిదేళ్ళ పాటు మునిసిపల్ మంత్రిగా ఎంతవరకూ స్వేచ్చగా వ్యవహరించారో ఎవరికీ తెలియదు కానీ అమరావతి రాజధాని, బినామీ కధలు, భూ భాగోతాలు ఇలా చాలా తెర వెనక ముందూ ఆరోపణలలో మాత్రం ఆయన పేరు ప్రత్యర్ధులు తెచ్చేశారు.

లేటెస్ట్ గా నారాయణను అరెస్ట్ చేసింది టెన్త్ పేపర్స్ లీక్ విషయంలోనే అయినా ఆయన మీద అమరావతి రాజధాని కేసు బలంగా చుట్టుకోబోతోంది. ఈ కేసు విషయంలో వైసీపీ సర్కార్ గట్టి పట్టుదలగా ఉంది. అదే టైమ్ లో చూసుకుంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు అయింది.

ఇక అమరావతి రాజధాని విషయంలో చూస్తే 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన భూ సేకరణలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఇప్పటికీ వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. దీని మీద మూడేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఈ విషయంలో భూసేకరణలలో వచ్చిన ఆరోపణలు అలాగే ఉండిపోయాయి.

ఇక నారాయణను మొదట్లోనే ఈ కేసు విషయాన అరెస్ట్ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ నాడు ఆయనను ఎందుకో వదిలేసినట్లుగా అనిపించినా ఇపుడు మాత్రం గట్టిగానే కేసులు పెట్టేలా సీన్ కనిపిస్తోంది. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజ్ విషయం కూడా సీరియస్ మ్యాటరే అయినా దీని కంటే పెద్ద మ్యాటర్ అమరావతి రాజధాని భూముల కధ. దాంతో అక్కడ కేసులతో పాటు మరిన్ని కేసులు కూడా ఈ మాజీ మంత్రి చుట్టూ అల్లుకునేలా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి నారాయణ రాజకీయాల మీద విరక్తి చెందారో మరేమో తెలియదు కానీ మూడేళ్ళుగా యాక్టివ్ గా లేరు.

ఆ మధ్యన ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతా రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నా కూడా ఆయన సున్నితంగా నో చెప్పారు అని ప్రచారం జరిగింది. అయినా గత కాలపు మంత్రి వైభోగం, దానికి మించి చంద్రబాబు సాన్నిహిత్యం ఇపుడు ఈ మాజీ మంత్రిని టార్గెట్ అయ్యేలా చేశాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.