Begin typing your search above and press return to search.
శ్రీనివాస్ ను క్లోజ్ చేసేందుకు బాబు కుట్ర!
By: Tupaki Desk | 31 Oct 2018 4:53 PM GMTవైసీపీ అధ్యక్షుడు జగన్ పై హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో శ్రీనివాస్ ను విచారణ చేస్తున్నారని....కానీ, సూత్రధారులు ఎవరన్న సంగతి బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. దానికితోడు - తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ ...స్వయంగా మంగళవారం నాడు వెల్లడించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను చంపేందుకు భారీ కుట్ర జరిగిందని, ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖ ఎయిర్‌పోర్ట్ లోకి కత్తులు వెళ్లాయని ఆరోపించారు. అంతేకాకుండా, శ్రీనివాస్ ను చంపి కేసు క్లోజ్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకుంటే ..సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు `ఆపరేషన్ గరుడ` నిజమని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఏపీలో `ఆపరేషన్ చంద్రబాబు` కొనసాగుతుందంటూ విమర్శించారు. సీఎం - డీజీపీ దర్శకత్వంలో నిందితుడు శ్రీనివాస్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ పై దాడి కేసులో థర్డ్ పార్టీ దర్యాప్తుకు అంగీకరిస్తూ లేఖ రాయాలని సవాల్ విసిరారు. ఈ కేసును సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ స్వయంగా చెప్పిన వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దాడి వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లు శ్రీనివాస్ వెల్లడిస్తాడనే అనుమానంతోనే ...అతడిని చంపేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందన్న విషయంపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం వల్లే...శ్రీనివాస్ కు ఏమీ కాలేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తాము శ్రీనివాస్ కు రక్షణ కవచంలా ఉన్నామని..అందుకే అతడిపై ఈగ వాలడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని, శ్రీనివాస్ కు మరింత కట్టుదిట్టమైన భద్రత..రక్షణ...వైద్య పర్యవేక్షణ అందించాలని వారు కోరుతున్నారు.